*జననేత్రంన్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరమార్చ్21*//:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గ్రామపంచాయతీకి సంబంధించిన వాహనం పార్కింగ్ ఫీజు, గోదావరి రేవు పాట, కొత్త మార్కెట్ లోని మంగళవారం సంత ఆసీలు, చచ్చు రోడ్ షాప్ నెంబర్1,2, పిల్లల పార్కు షాప్ నెంబర్ 2కి 2025-26 ఆర్థిక సంవత్సరం గాను భద్రాచలం గ్రామపంచాయతీలో శుక్రవారం బహిరంగ వేలం నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వేలంలో వాహనాల పార్కింగ్ ఆశీలు కోటి రూపాయల మార్క్ దాటడంతో భద్రాచలంలో వేలం పాట చర్చనీయంశంగా మారింది. గత సంవత్సరం 98 లక్షలకి వెళ్లిన ఆశిలు ఈ సంవత్సరం 1కోటి 20 లక్షలకు భద్రాచలంకి చెందిన భూక్యా రంగా వేలంలో పాల్గొని వాహనాల పార్కింగ్ ఆశీలు ని దక్కించుకున్నారు. కొత్త మార్కెట్ మంగళవారం సంత ఆశీలు ని 3,80,000/- భూక్య రంజిత్ పాడుకొన్నారు. కోర్స చినబాబు దొర ఫెర్రీ 27,25,000, కుప్ప గిరిబాబు, చర్చి రోడ్ షాప్ 1- 1,45,200, కుప్ప గిరిబాబు చర్చి రోడ్ షాప్ 2- 1,32000 లక్షలు, రాజనేని మధు చిల్డ్రన్ పార్క్ షాప్ 1, 90,200 రూపాయలకు వేలంలో పాల్గొని దక్కించుకున్నారు.
C.E.O
Cell – 9866017966