*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ఏప్రిల్12*//:ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం కొత్త మేడిపల్లి గ్రామంలో స్థానికంగా నివసిస్తున్న ప్రజల మధ్యలో పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ – ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ హోప్ ఆధ్వర్యంలో తలపెట్టిన ఉచిత వైద్య శిబిరం ద్వారా స్థానిక కొత్త మేడేపల్లి కోయ సామాజిక ప్రజలు 180 మందికి వైద్య పరీక్షలు చేసి అందరికి ఉచితంగా మెడిసిన్ పంపిణి చేశారు. ఈ నేపథ్యంలో ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ హోప్ డైరెక్టర్ శ్రీ జయరాజ్ మాట్లాడుతూ కొత్తమేడేపల్లి ప్రజలకు వైద్య సేవలు అందించడం చాలా సంతోషంగా ఉందని మరియు ఈ గ్రామానికి మేము రావడానికి మూలకారణమైన పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డా. పీటర్ నాయక్ లకావత్ మరియు వారికి అన్ని విధాలుగా సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సి.కే. న్యూస్ చైర్మన్ భూక్యా ఉపేందర్ కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డా పీటర్ నాయక్ మాట్లాడుతూ అడిగిన వెంటనే వచ్చిన హ్యాండ్ ఆఫ్ హోప్ డైరెక్టర్ జయరాజ్ కి మరియు వైద్య బృంధానికి పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ తరుపున కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో హ్యాండ్ ఆఫ్ హోప్ డైరెక్టర్ జయరాజ్, పీటర్ నాయక్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డా. పీటర్ నాయక్ లకావత్, జాన్ లకావత్, సి.కే. న్యూస్ చైర్మన్ భూక్యా ఉపేందర్, భూక్యా లక్ష్మి, సికే. న్యూస్ స్టాఫ్ మౌనిక, సి.కే. న్యూస్ స్టాఫ్ బాలు తదితరులు పాల్గొన్నారు.
C.E.O
Cell – 9866017966