*జననేత్రం న్యూస్ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ప్రతినిధి జూన్02*//: ఏ కొండూరు మండలం, కోమటకుంట గ్రామంలో రేషన్ దుకాణంలో సరుకులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గడ్డి కృష్ణారెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విధానం గురించి రేషన్ షాపు వద్దనే సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన గడ్డి కృష్ణారెడ్డి మాట్లాడుతూ….
జూన్ 1 వ తేదీ నుంచి రేషన్ సరుకులు రేషన్ షాపుల్లో పొందవచ్చు. అదేవిధంగా ఆదివారాల్లో కూడా రేషన్ దుకాణాలు పూర్తిస్థాయిలో పనిచేస్తాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. నిత్యవసరాల సరుకులను మళ్లీ పాత పద్ధతిలోనే రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయనుంది. ఇప్పటివరకు రేషన్ వాహనాల సప్లై చేస్తూ వచ్చారు కానీ ఆ వాహనాలు వచ్చినప్పుడు తమకు రేషన్ తీసుకోవడానికి కుదరట్లేదు అని ప్రజలు ఐవిఆర్ఎస్ సర్వేలో చెప్పారు. అందువల్ల ప్రభుత్వం ఆ వాహనాలను ఆపేసింది రేషన్ షాపుల దగ్గరే సరుకులు సబ్సిడీ ధరలకు అందించబోతుంది.
వాహనాల ద్వారా పంపిణీ చేయడం తో ప్రభుత్వంపై అధిక భారం పడుతుందని భావించి ఆర్థిక భారాన్ని తగ్గించి మళ్లీ పాత విధానంలోనే రేషన్ సరుకులు పంపిణీ చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 29,760 రేషన్ డిపోల ద్వారా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సరుకులు పంపిణీ జరుగుతుంది సబ్సిడీ ధరలకు అమ్ముతారు. అదేవిధంగా 65 సంవత్సరాల దాటిన ఒంటరి ముసలివారు, వికలాంగులు, భార్యాభర్తలు ఇద్దరూ ముసలివారు అయితే వాళ్లు మాత్రం రేషన్ సరుకులు కోసం డీలర్ల దగ్గరకు రావాల్సిన పనిలేదు. 1 నుంచి 5 వ తేదీలోగా రేషన్ డీలర్ వారి ఇంటికి వెళ్లి రేషన్ సరుకులు ఇస్తారు. ఇందుకు సంబంధించి డీలర్ల దగ్గర జాబితాలు సిద్ధంగా ఉన్నాయి అందువల్ల ముసలివారికి రేషన్ షాపులకు వెళ్లే ఇబ్బంది ఉండదని ఏ కొండూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గడ్డి కృష్ణారెడ్డి తెలియజేశారు.
C.E.O
Cell – 9866017966