*జననేత్రం న్యూస్.పాల్వంచ మండలం ప్రతినిధి జూన్20*//:పాండురంగాపురం రెవిన్యూ, ప్రభాత్ నగర్ శివారు సర్వేనెంబర్ 126/151, 126/152, 126/162, 126/11 భూముల్లో కొందరు భూ అక్రమార్కులు భూభారతిలో పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారని వాటిని తిరస్కరించి వాస్తవ సాగుదారులైన పేద ప్రజల కు పట్టాలు ఇవ్వాలని తెలంగాణ రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి డి పున్నం చంద్ డిమాండ్ చేశారు.
శుక్రవారం పాల్వంచ మండలo పాండురంగాపురం రెవిన్యూ సర్వేనెంబర్ 126 లో అక్రమార్కులకు పట్టాలు ఇవ్వొద్దని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు తెలంగాణ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తాహసిల్దార్ దార ప్రసాద్ కి ఇవ్వడం జరిగింది. తాహసిల్దార్ స్పందిస్తూ భూములు పరిశీలిస్తామని అప్పటివరకు పట్టాలు జారీ చేయమని హామీ ఇచ్చారు.
ఈ ధర్నా ను ఉద్దేశించి పున్నం చందు మాట్లాడుతూ గత రెండు దశాబ్దాలుగా 167 మంది పేదలు ఆదివాసీలు చెట్లు, తుప్పలతో కూడి ఉన్న రెవిన్యూ భూమిని చదును చేసి సాగు చేస్తున్నారని తెలిపారు. ఆ భూమిపై కన్నేసిన అక్రమార్కులు సాగుదారులకు సంబంధం లేకుండా డబ్బు, రాజకీయ పలుకుబడిని ఉపయోగించి రికార్డుల్లో నమోదు చేయించుకునేందుకు అనేక కుట్రలు పన్నుతున్నారని, ఇప్పుడు కూడా భూభారతిలో దరఖాస్తు చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. పైన తెలిపిన సర్వే నెంబర్లలోని అక్రమార్కుల దరఖాస్తులను తిరస్కరించి పేదలు ఆదివాసీలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదలకు, ఆదివాసీలకు అన్యాయం జరిగితే పెద్ద ఎత్తున ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతుకూరి సంఘం జిల్లా నాయకులు కుంజ వెంకటేశ్వర్లు, సోందే గోపమ్మ, కుంజ సోమక్క, తోలేo మమత, గౌతమి, వర్స దనమ్మ, డి పూజిత, నైనారపు నరసింహారావు, రాంబాబు, కారం నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
C.E.O
Cell – 9866017966