*నగరంలో పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం పెంపుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
*సీజనల్ వ్యాధుల వ్యాప్తి నియంత్రణకు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి
*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో జూన్25*//:ఖమ్మంమున్సిపల్కార్పొరేషన్ పరిధి 4వ డివిజన్ లో సీసీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మలఅర్హులైననిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.
మంత్రివర్యులు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య లతో కలిసి బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 4వ డివిజన్ రాజీవ్ నగర్ గుట్ట ప్రాంతంలో టి.యు.ఎఫ్. ఐ.డి.సి. నిధులు 50 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా *మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ* 4వ డివిజన్ రాజీవ్ నగర్ గుట్ట ప్రాంతంలో అవసరమైన విద్యుత్ లైన్లు వేసేందుకు నిధులు చెల్లించామని, స్థానిక అధికారులు దగ్గరుండి సరిగ్గా పని చేయించుకోవాలని అన్నారు. నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
11వ డివిజన్ లో ప్రజలందరి భాగస్వామ్యంతో ప్రత్యేక పారిశుద్ద్య కార్యక్రమం చేపట్టాలని అన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన పనులు వానలు రాకముందే పూర్తి చేయాలని, డ్రైయిన్ నిర్మాణ పనులు ప్రాధాన్యతగా చేపట్టాలని అన్నారు.
100 రోజుల యాక్షన్ ప్లాన్ అన్ని డివిజన్ లలో అమలు చేయాలని, వర్షాకాలంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పేదలు నివసించే ప్రాంతాల్లో అధిక శ్రద్దతో ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేయాలని అన్నారు. నగరంలో పెండింగ్ అంతర్గత రోడ్డు, డ్రైయిన్ నిర్మాణ పనులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, వర్షాకాలం ముగిసిన తర్వాత వాటిని మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు.
డివిజన్ ను పరిశుభ్రంగా ఉంచుకోవడం, పెద్ద ఎత్తున మొక్కలు నాటి పచ్చదనం పెంచడం బాధ్యతగా చేయాలని, ఖాళీ స్థలంలో నీరు నిల్వ ఉండకుండా, చెత్త పేరుకొని పోకుండా చూడాలని, ప్రైవేట్ ఖాళీ స్థలాలకు ఫెన్సింగ్, గ్రౌండ్ లెవెలింగ్ వంటి పనులు చేపట్టాలని భూ యజమానులకు నోటీసులు జారీ చేయాలని అన్నారు.
*నగర మేయర్ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ* డివిజన్ లో అంతర్గత రోడ్లు, డ్రైయిన్ నాణ్యతతో నిర్మించుకోవాలని అన్నారు. మన ఇంటి ముందు చెత్త వేయవద్దని, కార్పోరేషన్ అధికారులకు సహకరించాలని అన్నారు. ఖమ్మం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, ప్రజలు తమ వంతు బాధ్యత నెరవేర్చాలని అన్నారు.
*నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ* 580 మీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులకు 50 లక్షల రూపాయలతో నేడు శంకుస్థాపన చేశామని అన్నారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు రోడ్డు విస్తరణ పనులు, పేయింటింగ్ పనులు, పారిశుధ్య నిర్వహణ కోసం నూతన వాహనాలను కొనుగోలు చేశామని అన్నారు. నగరంలో ప్రజలకు ప్రాథమిక వసతుల కల్పన లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహ్రా, పబ్లిక్ హెల్త్ ఇఇ వి.రంజిత్, మునిసిపల్ ఇఇ కృష్ణలాల్, ఖమ్మం. ఆర్డీఓ నరసింహా రావు, ఖమ్మం అర్బన్ తహసిల్దార్ సైదులు, కార్పొరేటర్ లు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
C.E.O
Cell – 9866017966