జననేత్రం.న్యూస్.హనుమకొండజిల్లా.బ్యూరో.జూలై05//:పరకాల మున్సిపాలిటీ పరిధిలోని నివాస గృహాల మధ్యలో గల ఖాళీ స్థలాలను శుభ్రంగా ఉంచులని పరకాల మున్సిపాలిటీ కమిషనర్ సుష్మ పట్టణ ప్రజలను కోరారు వర్షాకాలం ప్రారంభమవుతున్నందున నివాసాల మధ్యలో ఉండబడిన ఖాళీ ఇంటి స్థలాలలో యజమానులు పిచ్చి మొక్కలు తొలగింపు తో పాటు గుంతలలో మొరంనింపాలన్నారు పిచ్చి మొక్కలు వర్షపు నిలువ ఉండటం వలన దోమల బెడద ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆమె అన్నారు దానివలన ఆయా ప్రాంతాలలో ఉండబడిన ప్రజలు వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని అన్నారు పరకాల పట్టణంలో ప్లాట్లు కొని ఇతర మండలాల్లో ఉన్న భూ యజమానులు వారి స్థలాలలో పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు లేనియెడల మున్సిపాలిటీ చట్టం 2019 ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని పరకాల మున్సిపాలిటీ కమిషనర్ సుష్మ తెలిపారు.
C.E.O
Cell – 9866017966