*నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ అడేల్లి మహా పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన జరపలి*
జననేత్రం న్యూస్ నిర్మల్ జిల్లా ప్రతినిధిజూలై06*//:నిర్మల్ జిల్లాలోప్రసిద్ధపుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ అడెల్లి మహా7 పోచమ్మ విగ్రహా ప్రతిష్టాపన నూతన దేవస్థానంలో వీలైనంత తొందరగా చేయాలని సారంగాపూర్ మండలంలోని 32 గ్రామపంచాయతీల భక్తులు8 కోరుకుంటున్నారు.కౌట్ల(బి) శ్రీ అడెల్లి పోచమ్మ భక్తులు స్థానిక దేవాలయ కార్యాలయంలో ఆదివారం రోజున దేవస్థాన చైర్మన్ సింగం భోజ గౌడ్ మరియు ఆలయ సీనియర్ అసిస్టెంట్ రాజేష్ కుమార్ కు వినతి పత్రం అందజేసారు వారు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుండి గంగ నీళ్ల జాతర బాలలయంలో జరుగుతుంది.ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర చత్తీస్గడ్ ప్రాంతాల నుండి అనేక భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు కానీ భక్తులు అనేక ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. ఈ సంవత్సరం జరగాల్సిన జాతర వచ్చే సెప్టెంబర్ 27, 28 తేదీలలో జరగనుంది.జాతర కంటే ముందు నూతన దేవాలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కొరకు చైర్మన్ మరియు అధికారులు తొందరగా చొరవ తీసుకొని కార్యక్రమాలను ప్రారంభించాలని కౌట్ల బి భక్తులు వినతి పత్రం అందజేశారు.
C.E.O
Cell – 9866017966