జననేత్రంన్యూస్ఉమ్మడిఖమ్మంజిల్లాబ్యూరో.జూలై06*//:గిరిజనబంజారాల సంస్కృతి సాంప్రదాయల సీత్లా పండుగను పెద్ద పూసాల కార్తె మొదటి మంగళవారం జులై 8న జాతి మొత్తం ఒకే రోజున జరుపుకొని జాతి ఐక్యతను సాటాలని విజ్ఞప్తి చేస్తూ ఆలిండియ బంజార సేవ సంఘ్ ఎడ్యుకేటివ్ మెంబర్ తేజావత్ నరసింహారావు నాయక్ గిరిజనుల బంజారాల కట్టుబొట్టు వేషధారణలతో సంస్కృతి సంప్రదాయలాలను అతి పవిత్రంగా ప్రకృతిని పూజించడం ప్రేమించడం బంజారాల ప్రత్యేకత అలాగే పండుగ సందర్భంగా పశువులను పూజించి ప్రతి సంవత్సరం పెద్ద పూసాల కార్తె మొదటి లేదా రెండో మంగళవారం గిరిజన జాతి శుభ ఒట్టిపడేలా సిత్లా పండుగ జరుపుకోవడం అనవైతి ఈ పండు రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు ఒకేసారి జరుపుకోవాలని గత పది సంవత్సరాలుగా బంజారా జాతి పెద్దలు విద్యావంతులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే గిరిజనులు తాము జరుపుకునే పండుగలు మొదటి పండుగ సీత్ల పండుగ కావడం విశేషం. పండుగ సారాంశం: పూర్వం గిరిజనలు బంజారాలు ఎక్కవ సంఖ్యంలో పశు సంపదలను కలిగి ఉండి వ్యవసాయ జీవన అధారంగా జీవించేవారు అందుకే వారు పశువులను ఊరికి పచ్చగా ఉండే దూర్పఆంతాలకు మేకలను గొర్రెలను తీసుకువెళ్ళి ఆయా ప్రాంతాలలో గూడెం ఏర్పాటు చేసుకుని జీవనం సాగించేవారు వాతావరణలో వచ్చిన మార్పుల వల్ల పచ్చగా ఉండాల్సిన ప్రాంతాలు ఒకసారిగా మార్పు సంచరించుకోవడంతో పశువులను వివిధ రోగాలు7 వచ్చేవి ఇలా రోగాలు బారిన పడిన పశుసంపద రోజురోజుకి తగ్గిపోవడంతో తండావాసులు తల్లడిల్లిపోతున్న నేపథ్యంలో ఒకరోజు రాత్రి తాండ పెద్దకు ఏడుగురు దేవతలు కలలోకి వచ్చారు. ఆ ఏడుగురి దేవతలలో చిన్నదైన సితుల భవాని ప్రత్యక్షంగా కలలోకి వచ్చి తనను ప్రత్యేకించి పూజించి జంతుబలి చేస్తే రోగాల బారిన పడి చనిపోతున్న పశుసంపదను కాపాడుతానని చెప్పి అదృశ్యమైనది. మరునాటి నుండి ఆ తండా పెద్ద తండాలోని ప్రజలందరికి ఒక దగ్గర కూర్చోబెట్టి తన కలలో వచ్చిన సిల్లా భవాని వచ్చి చెప్పిన విషయాలను ప్రజలకు వివరించారు. ఈ విధంగా బంజారాల పండుగ ప్రాచీనం నుంచి ఆచరణలో విచ్చింది. సాత్ భవాని(ఏడుగులు దేవతలు) సిత్లా పండుగ : పశువులు రోగాల బారిన పడిచనిపోతున్నప్పుడు పశు సంపదను కాపాడాలని కోరుతూ గిరిజన బంజరా సాత్ భవాని)ఏడుగురు దేవతలు) అయిన మేరామా, తొల్జా, మంత్రాల్, కేంకాళి, హింగ్లా, ద్వాల్లాగార్, సిల్లా భవానీలను (దేవతలను) పూజించడమే సిత్లా పండుగ సిత్లా పండుగ విధానం: పెద్ద పూసల కార్తె మొదటి లేదా రెండువ మంగళవారం జరుపుకునే ఈ పండుగ గిరిజనలు ఇళ్లలో తాండకు సమీపంలో ఓ ప్రత్యేక దేవతల విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. ఏడుగురు దేవత మూర్తుల విగ్రహాలను రాళ్ల రూపంలో వరుస క్రమంలో పేర్చి దేవత విగ్రహాలను ఎదురుగా లుంకాడియా విగ్రహాన్ని ఏడుగురు దేవతల వైపు చూసే విధంగా ఏర్పాటు చేస్తారు. కన్నే పిల్లలచే దేవతలకు నైవేద్యం : సిల్లా భవాని విగ్రహాలకు రంగు పూసి మామిడి తోరణాలను దేవత మూర్తుల చూట్టూ కట్టి అలంకరిస్తారు పండుగకు ఒక రోజు ముందు జొన్నలు, పప్పు ధాన్యాలు నానబెట్టి పండుగ రోజు వండుతారు దీనిని గుగ్రిలని వాసిడో అని అంటారు. వండిన అ పదార్ధాన్ని ముందుగా పెళ్ళి కాని యువతల చేత దేవతలకు నైవేద్యం ప్రసాదం అందించే విధంగా యువతల చేత అందిస్తారు. గిరిజన వేషధారణలో పెద్ద ఎత్తున మేళా తాళాలతో మేకలతో, గొర్రె పొట్టేలతో దేవతలకు బలివ్వడం కోసం తీసుకొస్తారు. సీత్ల భవానీలకు (దేవతలకు) బంజారా గిరిజనల ఇంట వండుకొని లాస్సి(పాయసం)నీ పూజలో ఉంచి గొర్రెపోతుల పై నీళు &ళ పోసి జడత ఇస్తారు. ఆ గొర్రె పోతులకు భవాని ముందు బలి ఇస్తారు. గొర్రె మేక పోతులను బలి ఇచ్చి పొట్టలో పేగులను బయటకు తీసి ఏడుగురు దేవతల భవనీల ప్రతిమ నుంచి లుంకడియా ప్రతిమ వరకు నేలపై పరుస్తారు. అనంతరం యువకులు చెంబులతో తెచ్చిన నీళ్ళలో ఏడుగురు దేవతల ప్రతిమతో పాటు లింకుడిగా ప్రతిమను జలాభిషేకం చేస్తారు. ఇలా గిరిజన బంజరుల సాంప్రదాయ పండుగ దాటుడును ఘనంగా చేసి వారి సాంప్రదాయాలను విశ్వాసాలను మేరుగుపస్తారు.
C.E.O
Cell – 9866017966