జననేత్రం న్యూస్ నందిగామ నియోజకవర్గం ప్రతినిధిజులై011*//:మీడియేషన్ సెంటర్ నందు ఏర్పాటు చేసినకార్యక్రమానికిముఖ్యఅతిథిగా పాల్గొన్న నందిగామ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి షేక్ రియాజ్ . ఈ సందర్భంగా షేక్ రియాజ్ జడ్జిమాట్లాడుతూ రెండు వర్గాల మధ్య, కక్ష దారుల మధ్య ఉన్న అఘాదాన్ని తొలగించి మధ్య వర్తిత్వం ద్వారా వారికి తెలియపరచి వారిని రాజీ పడే విధముగా చేయటమే ఈ మీడియేషన్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని, మధ్యవర్తిత్వం యొక్క లక్ష్యం వివాదాస్పదమైన అంశాలను పరిశీలించి ఇరువర్గాలకు ఆమోదయోగ్యమైన రాజీ చేయటమే ఈ మీడియేషన్ యొక్క లక్ష్యం అని, పార్టీలు వారి యొక్క సమస్యలు పరిష్కరించటానికి చర్చించటానికి అనుకూలమైన వేదిక అని ఎన్నో సంవత్సరముల నుండి ఉన్న కేసులను సత్వర పరిష్కరించటానికి కక్ష దారులకు అర్థమయ్యే రీతిలో చర్చించుకోవటానికి అనుకూలమైన వేదిక అని ఎన్నో సంవత్సరముల నుండి ఉన్న పెండింగ్ కేసులలో సమస్యలను పరిష్కరించి వారికి అనువైన పరిష్కార మార్గం చూపించడమే దీని ముఖ్య ఉద్దేశమని తెలిపారు. మన కోర్టులలో అద్దంకి మణిబాబు, షేక్ ఆజాద్, శ్రీమతి కోయ దివ్య, అనే న్యాయవాదులు ఈ మీడియేషన్ ట్రైనర్స్ గా ఉన్నారని తెలిపారు.
బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అద్దంకి మణిబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కన్నెగంటి జీవరత్నం మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టి జరుగుతుందని కక్ష దారులకు వారి యొక్క సమస్యలు తెలుసుకుని ఈ మీడియా ద్వారా సమస్యలను పరిష్కరించటమే ముఖ్య ఉద్దేశమని ఇరువర్గాల కక్ష దారుల యొక్క రాజీమార్గమే రాజ మార్గమని అందుకు ఖర్చు సమయం వృధా కాకుండా స్నేహపూరితమైన వాతావరణంలో అందరూ కలసి ఉండవచ్చును అని అన్నారు. బార్ ట్రెజరర్ మాడుగుల స్టాలిన్ బాబు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ వేల్పుల కిషోర్, దారెల్లి అరుణ్ కుమార్, కస్తాల చరణ్, తాడేపల్లి కాంతారావు, మాజీ ఏపీపీ నండ్రు శ్రీరామ్ మూర్తి, షేక్ సైదా, షేక్ దాదా హుస్సేన్, గుడిసె సుమన్, బొబ్బిలిపాటి భాస్కరరావు, యరగొర్ల రామారావు, శేట్టి వెంకటేశ్వర్లు, కక్ష దారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం జడ్జిగారు కక్ష దారులకు రాజి చేసుకునేందుకు కరపత్రాలను పంచినారు.
C.E.O
Cell – 9866017966