*జననేత్రం న్యూస్ జోగులాంబ గద్వాల జిల్లా బ్యూరో*//: జోగులాంబ గద్వాల జిల్లా బిజెపిఅధ్యక్షులు తపాల రామాంజనేయులు ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో ఓటు హక్కు అడిగే బాధ్యత భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని తెలిపారు ఎందుకనగా రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎటువంటి అభివృద్ధి కి నోచుకోవడం జరగలేదు కానీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వాలకు విడుదల చేస్తూ గ్రామాలకు నేరుగా నిధులను జమ చేయడం జరుగుతుంది గ్రామాల్లో సిసి రోడ్లు వైకుంఠధామాలు పల్లె ప్రకృతి వనాలు అంగన్వాడీలను ఆధునీకరణ. నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు కేంద్ర ప్రభుత్వం ద్వారా మాత్రమే రావడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం బీసీలను మోసం చేస్తూ *42% ఇస్తామని* అయోమయంలో గందరగోళానికి గురి చేస్తుందని ఇది పూర్తిగా జరిగినటువంటి అంశంగా దీనిని అనవుగా తీసుకొని స్థానిక సంస్థల పట్ల కాలయాపన చేస్తుందని పేర్కొన్నారు మిగతా రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అవినీతి లేకుండా పరిపాలిస్తుందని అవినీతి లేని ప్రభుత్వం ఒక బీజేపీ పార్టీతోనే సాధ్యమని తెలిపారు కావున రానున్నటువంటి స్థానిక ఎన్నికలలో గ్రామపంచాయతీ ఎన్నికలు గాని మున్సిపాలిటీ ఎన్నికలలో సర్పంచ్లను ఎంపీటీసీ జడ్పిటిసి లను బిజెపి అభ్యర్థులను మాత్రమే గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు అలాగే కార్యకర్తలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ కేంద్ర ప్రభుత్వ పథకాలను కేంద్రం విడుదల చేసేటువంటి నిధులను ప్రజలకు తెలపాలని కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తూ ప్రజలను చైతన్యవంతం చేయాలని తెలిపారు అనేక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాల గురించి వివరించారు పీఎం కిసాన్ యోజన పథకం విశ్వకర్మ యోజన యోజన పథకం ప్రధానమంత్రి జీవిత పథకం ముద్ర యోజన పథకం లాంటి అనేక సంక్షేమ పథకాల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు రామచంద్ర రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ అలంపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి రాజగోపాల్ జిల్లా ఉపాధ్యక్షులు కేకే రెడ్డి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ జయలక్ష్మి రాజోలు మండల అధ్యక్షులు శశి కుమార్ సీనియర్ నాయకులు సంజీవరెడ్డి నరసింహులు భూత్ అధ్యక్షులు పరుష తిరుమలేష్ రాఘవేంద్ర రఘు బి కే శ్రీనివాసులు రంగస్వామి మొదలగు బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు
C.E.O
Cell – 9866017966