జననేత్రంన్యూస్ నిర్మల్.జిల్లా.ప్రతినిధిజులై16*//:సారంగాపూర్ మండల కేంద్రంలో స్వర్ణ గ్రామంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్వర్ణ ప్రాజెక్ట్ కుడి కాలువ ద్వారా నీటిని దిగివకు విడుదల చేశారు. రైతులు పంట పొలాలకు నీటిని సద్వినియోగం చేసుకోవాలనిసూచించారు.స్వర్ణ ప్రాజెక్ట్ వంతెన పై రూ. 32 లక్షలతో లైటింగ్ ఏర్పాటుకు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి భూమి పూజ చేసారు. మరియు స్వర్ణ గ్రామంలో రూ. 20 లక్షలతో నూతన PHC హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమి పూజకు శంకుస్థాపన చేశారు. PHC హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణం పూర్తి అయితే గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు కొంత మేర ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు, పంచాయతీ రాజ్,రెవెన్యూ అధికారులు మరియు జిల్లా నాయకులు రావుల రాంనాథ్, మెడిసెమ్మ రాజు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
C.E.O
Cell – 9866017966