*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో జులై17*//: ఖమ్మంలోని టి ఎన్ జీ ఓస్ ఫంక్షన్ హాల్లో పే బ్యాక్ సొసైటీ అత్యవసర సమావేశం జరిగింది. దీనికి ముఖ్యతిదిగా ఎస్ సి కార్పొరేషన్ రిటైర్డ్ ఈ డి దామళ్ళ సరవయ్య పాల్గొన్నారు. ఈ సందర్బంగా పే బ్యాక్ సొసైటీ జిల్లాలో నిర్వహిస్తున్న సేవలను కొనియాడారు. పేద, ఆర్ధిక స్థోమత లేని ఎంపిక చేసిన కుటుంబాలకు చేయుతనందించాలని లక్ష్యంతో పనిచేయడం అభినందనీయం అన్నారు. వ్యవస్థలో పేదలకు సహాయం చేయాలానే సుగుణాన్ని అలవార్చుకోవాలని కోరారు. సొసైటీ నాయకులు జంగం లక్ష్మణ్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యకమంలో టి ఎన్ జి ఓస్ కేంద్ర కార్యావర్గంలో కార్యదర్శి గా ఎన్నికైన జడ్ ఎస్ జయపాల్ విజయకుమార్ తో పాటు ఐ.ఐ.టి లో ర్యాంక్ సాధించిన లింగాల ఆదర్శ్, పెరుమాళ్లపల్లి సుమాంజలి విద్యార్థులను సత్కరించి, నిరుపేద విద్యార్థిని సుమాంజలి కి 25,000/-, లింగాల ఆదర్శ్ కు 10,000/- మొత్తం 35,000 రూపాయల నగదును పే బ్యాక్ సొసైటీ ఆధ్వర్యంలో వారికి ఆర్థిక సహాయం చేయటం జరిగింది. అలాగే పే బ్యాక్ సొసైటీ నాయకులు చిలకబత్తిని కనకయ్యలు విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడుతూ మద్రాస్ ఐఐటి లో సీటు సంపాదించిన పెరుమాళ్ళ సుమాంజలి, లింగాల ఆదర్శ్ విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉండి తల్లి తండ్రులకు మరియు మనమొచ్చిన సమాజానికి తప్పకుండా సేవలు అందించాలని కోరారు నేడు విద్యార్ధుల భవిష్యత్తు కోసం ఎన్నో సంవత్సరాలుగా సొసైటీ చేస్తున్న సేవలను గుర్తుంచుకొని తిరిగి మరల మీ భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బార్ కౌన్సిల్ కి పోటీ చేస్తున్న అడ్వకేట్ మర్రి ప్రకాష్, రెంటాల ఆనంద్, అంబేద్కర్ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు లింగాల రవికుమార్, వరదా నర్సింహారావు, పెరుమాళ్ళ శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టులు, దామల్ల సత్యం పప్పుల వేణుగోపాల్, బాబురావు, పాగా యోనా, సొసైటీ సభ్యులు మోహన్ రావు, సాయిబాబు, రాములు, విజయ్,గోవింద్, కృష్ణ, రామారావు తదితరులు పాల్గొన్నారు.
భీమ్ మిషన్ అఫ్ ఇండియా తరపున విద్యార్థులకు చెరొక ఐదు వేల రూ లు చొప్పున దామల్ల సర్వయ్య అందించారు..
C.E.O
Cell – 9866017966