జననేత్రం న్యూస్ భద్రాది కొత్తగూడెం జిల్లా బ్యూరో జులై20*//: భద్రాచలం స్థానిక ఆదర్శ్ నగర్ కాలనీ నందు మహాజన మహిళా సమైక్య మండలకమిటీవృద్ధ ,వితంతు, ఒంటరి మహిళలతో మహాజన మహిళా సమైక్య మండల అధ్యక్షురాలు అలవాల రేవతి ముదిరాజ్అధ్యక్షతనసమావేశం నిర్వహించడం జరిగింది. ఈసమావేశానికిముఖ్యఅతిథిగా మహాజన మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు మేకల లత పాల్గొని మాట్లాడుతూ… ఈనెల 24న కొత్తగూడెం పట్టణంలోజరిగేవికలాంగుల ,వృద్ధుల ,వితంతువుల, ఒంటరి మహిళల మరియు పెన్షన్ దారుల పెన్షన్ పెంపు జిల్లా సన్నాహక సదస్సు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెన్షన్ దారుల సన్నాహక సదస్సు జిల్లా సదస్సు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సామాజిక ఉద్యమ పరివర్తకులు, నవ యువ అంబేద్కర్ గౌరవ పద్మ మంద కృష్ణ మాదిగ హాజరవుతున్నారని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల జిల్లా ఇంచార్జ్ ములకలపల్లి రవి మాదిగ ఆదేశాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మహాజన మహిళలు తమ వంతు కర్తవ్యం గా వికలాంగులను, వృద్ధులను, వితంతువులను, ఒంటరి మహిళలను, మరియు పెన్షన్ దారులను జులై 24న కొత్తగూడెంలో జరిగే జిల్లా సన్నాహక సదస్సు కార్యక్రమంలో భాగస్వాములు చేసి వేలాది మంది పెన్షన్ దారులతో జిల్లా సదస్సును ప్రతి గ్రామం నుండి అధిక సంఖ్య లో తరలివచ్చి జయప్రదం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. సమావేశంలో మహాజన మహిళా సమైక్య నాయకులు గద్దల కృష్ణవేణి మాదిగ, బొమ్మనవేని మంగ, రావుల నిర్మలమ్మ, కోట ప్రసన్న, మరియు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళ సభ్యులు దుబ్బల కళావతి, వల్లపు రమణ, గండి దుర్గ, బుర్ర నాగమణి, వేముల దుర్గ, మాట్ల సంపతి తదితరులు పాల్గొన్నారు
C.E.O
Cell – 9866017966