*ఆటో డ్రైవర్ ను అసభ్య పదజాలంతో దూషిస్తూ, డ్రైవర్ పై చేయి చేసుకున్న విలేఖరి
*ఆటో డ్రైవర్ ఇరుగు రాజునీ గల్లా పట్టిలాగి, కులం పేరుతో దూషించిన వైనం
*బోనకల్ ప్రధాన సెంటర్ లో చంపుతా అంటూ బెదిరించిన విలేకరి
*విలేకరి పై స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన పోలీసులు
*జరిగిన ఘటన అంతా బోనకల్ సెంటర్లో గల సీసీ కెమెరాల్లో లభ్యం
*దళితుల్ని చులకనగా చేసి మాట్లాడిన విలేఖరిని పత్రిక నుంచి తొలగించి, తనకు న్యాయం చేయాలంటూ ఆటో డ్రైవర్ రాజు ఆవేదన
*విలేకరి వల్ల నాకు, నా కుటుంబానికి ప్రాణహాని ఉందని కన్నీటిపర్యంతం అయిన రాజు
*ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం
*జననేత్రం న్యూస్ ఖమ్మం జిల్లా బ్యూరో ఫిబ్రవరి19*//:ఆటో తన మోటర్ సైకిల్ వెళ్లేందుకు అడ్డుగా ఉందని దళిత ఆటో డ్రైవర్ పై ఓ దినపత్రిక విలేకరి దాడికి పాల్పడి, కులం పేరుతో దూషించిన సంఘటన బోనకల్ లో ఆలస్యం గా వచ్చింది. వివరాలలోకి వెళితే దళితుడైన ఆటో డ్రైవర్ రాజు నిత్యం ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఈ నెల 14న బోనకల్ లో ఆటో నిలిపి ఉంచడంతో బోనకల్ మండలం లో ఓ దినపత్రిక లో పనిచేస్తున్న విలేకరి తన మోటార్ సైకిల్ నిలిపి రాజు ను కులం పేరుతో దూషిస్తూ ప్రధాన సెంటర్ లో చొక్కా కాలర్ పట్టుకొని లాకెళ్లాడు. విలేకరి వలన తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, తనను పత్రిక నుంచి తొలగించాలని, విలేకరి పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని కోరుతూ పోలీస్ స్టేషన్ లో రాజు ఫిర్యాదు చేయడం తో కేసు నమోదు చేశారు. అయితే విలేకరి దౌర్జన్యం అంతా సెంటర్ లో సీసీ కెమెరా ల్లో నమోదు అయింది. అతని పై కఠిన చర్యలు తీసుకోవాలని కుల సంఘాలు, ఆటో డ్రైవర్లు కోరుతున్నారు.
C.E.O
Cell – 9866017966