*మన్యం జిల్లా పార్వతీపురం జననేత్రం న్యూస్ ప్రతినిధి ఫిబ్రవరి22*//: బహుజన టీచర్స్ అసోసియేషన్ (BTA-AP) పార్వతీపురం మన్యం జిల్లా శాఖ పక్షాన అధ్యక్షులు తందాడి అనిల్ కుమార్, గొల్ల ఉమామహేశ్వర రావు, గౌరవ అధ్యక్షులు మజ్జి సోమేశ్వరరావు, మంతిన గణనాథరావు, వన్నలి సింహాచలం వీరఘట్టం, పాలకొండ మండలాల్లోని ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉన్నత పాఠశాలలు కళాశాలలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలలో గాదె శ్రీనివాసులు నాయుడు కి మద్దతుగా విస్తృత ప్రచారం నిర్వహించారు. నాయుడు ని గెలిపించుకోవడం ఉపాధ్యాయ అధ్యాపక వర్గానికి తక్షణ అవసరమని వారు అన్నారు.
అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు ఉద్యోగ ఉపాధ్యాయ అధ్యాపక వర్గానికి మేలు చేసే స్థితిలో ఉండి కూడా ఇప్పటివరకు కనీసం డి ఏ, ఐ ఆర్, పి ఆర్ సి, పెండింగ్ బకాయిలు, పిఎఫ్ లోన్లు ఇతర ఆర్థిక అంశాలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తూ పై వర్గాలను అసంతృప్తికి గురి చేస్తున్నారు. కానీ అధికార పక్షాలు ఉపాధ్యాయ ఎన్నికలలో ఒక అభ్యర్థికి మద్దతు ప్రకటించి వారి గెలుపును కోరడం హాస్యాస్పదమన్నారు. కావున విద్యావంతులు విజ్ఞులు అయినా ఉపాధ్యాయ అధ్యాపక ఓటరు మహాశయులు తమ అమూల్యమైన ఓటు ద్వారా ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేసే ఒక అద్భుతమైన అవకాశం ఈ ఉపాధ్యాయ ఎన్నికలని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో డాక్టర్ గాదె శ్రీనివాసులు నాయుడు కి మొదటి ప్రాధాన్యత ఓటు (1) వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు.
C.E.O
Cell – 9866017966