*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ఫిబ్రవరి26*//:మహా శివరాత్రి సందర్భంగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తన ధర్మపత్ని విజయలక్ష్మీతో కలిసి నీలాద్రీశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు.ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం భవన్నపాలెం సమీపాన కొలువైన స్వయంభు నీలాద్రీశ్వర స్వామి వారి ఆలయాన్ని బుధవారం వారు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర -విజయలక్మీ పుణ్య దంపతులు హోమంలో పాల్గొని, శివలింగాన్ని పూలమాలలు, పంచామృతాలతో అభిషేకించి,గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు చేశారు.వేద పండితులు వారిని కండువాలతో గౌరవించి,తీర్థ ప్రసాదాలు అందజేశారు, ఆశీర్వచనాలు పలికారు.ఎంపీ రవిచంద్రతో కలిసి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దుగ్గిదేవర వెంకట్ లాల్, యూత్ లీడర్స్ సుంకర చిరంజీవి,ఆకుల సాయి, మద్దెల భానుప్రతాప్ తదితరులు స్వామి వారిని దర్శించుకున్నారు.
C.E.O
Cell – 9866017966