*ఐ.ఎఫ్.టి.యు. జాతీయ కన్వీనర్ షేక్ షావలి డిమాండ్. *పి.సునిత అధ్యక్షతన జరిగిన 115 వ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ కార్యక్రమం.
*జననేత్రం న్యూస్ ప్రతినిధి మార్చ్15*//:ఆపరేషన్ కగార్ పేరుతో మధ్య భారతదేశంలో ఆదివాసులపై కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు జరుపుతున్న మారణహోమాన్ని వెంటనే ఆపి, జీవించే హక్కును కాపాడాలని ఐ.ఎఫ్.టి.యు. జాతీయ కన్వీనర్ షేక్ షావలి డిమాండ్ చేశారు. 115 వ అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా మార్చి 1 నుండి 30 వరకు రెండు తెలుగు రాష్ట్రాలల్లో ఎత్తిపట్టండని
ప్రగతిశీల మహిళా
సంఘం(పీఓడభ్ల్యూ-విముక్తి) ఇచ్చిన పిలుపులో బాగంగా 2025, కాప్రా, జవహర్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో మార్చి-8, అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ కార్యక్రమం జరిగింది. పీఓడభ్ల్యూ(విముక్తి) పి.సునీత అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో షేక్ షావలి ప్రసంగిస్తూ మార్చి-8 ప్రపంచ శ్రామిక మహిళా ఉద్యమ చరిత్రలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన రోజు అని గుర్తుచేశారు. ఆకశంలో సగం, మానవ జాతి పోరులో సగ బాగమైన మహిళలు అన్నిరకాల అసమానతలు, దోపిడీ, పీడన, అణిచివేత, వివక్షతలను నేటికీ ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. 1910 కోపెన్ హెగెన్ లో రెండవ అంతర్జాతీయ శ్రామిక మహిళా సదస్సు ఇచ్చిన పిలుపునందుకొని ప్రపంచ వ్యాప్తంగా తమ హక్కుల సంఘటిత సందేశ దినంగా జరుపుకుంటారని పేర్కొన్నారు. ఇటీవల మద్య భారతదేశంలో కేంద్రంలోని బీజేపీ నరేంద్రమోదీ, అమిత్ షాల ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో గత కొంత కాలంగా సామాన్య ఆదివాసి మహిళలను, పిల్లలను, యువకులను మావోయిస్టులనే ముద్రవేసి కేంద్ర మిలటరీ బలగాలు, పోలీసులచే ఎన్కౌంటర్ పేరుతో హతమార్చాడాన్ని ఖండించారు. అడవిని, పర్యావరణాన్ని, మూగజీవాలను కాపాడుతున్న గిరిజనులను అడవి నుండి బలవంతంగా గెంటివేయడానికి చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొట్టాయని అన్నారు. దీని వెనుక వారికి అండగా నిలిచిన మావోయిస్టులు ఉన్నారనే సాకును చూపి అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు పాల్పడడం అమానుషం అన్నారు. వారు జీవించే హక్కుతో పాటు అటవీ సంరక్షణ చట్టాల కొరకు పోరాడుతున్న ఆదివాసుల పాదాల క్రింద ఉన్న అటవి భూములలో అపారమైన సంపదలు ఉన్నాయని, వాటిని బడా కార్పొరేట్ శక్తుల దోపిడీకి గురికాకుండా ప్రాణాలను ఫణంగా పెట్టి కాపాడుకొంటున్నారని గుర్తు చేశారు. అంతిమ యుద్దం పేరుతో జరుపుతున్న సామూహిక అత్యచారాలు, హత్యలకు వ్యతిరేకంగా ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ప్రశ్నించి, పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆపరేషన్ కగార్ ను వెంటనే ఎత్తివేసి, శాంతియుత, ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పేేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ద ప్రాతిపదికన తగిన చొరవ చూపాలని షేక్ షావలి డిమాండ్ చేశారు. దేశంలోని మహిళల కట్టు, బొట్టు ఆచారాలతో పాటు ఆట, పాట, పని, చదువు, ఉద్యోగాల విషయాల్లో చులకన చేయబడుతున్నారని పి.సునీత గుర్తు చేశారు.
సామ్రాజ్యవాద విష సంస్కృతిలో సరుకుగా చూపే ప్రపంచ సుందరిమణుల అందాల పోటీలు హైదరాబాద్ లో నిర్వహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని అన్నారు. ప్రేమ పేరుతో పెట్రోల్, యాసిడ్ దాడులు, దౌర్జన్యాలు, పరువు హత్యలు పెరిగాయాని తెలియజేశారు. స్త్రీ వ్యక్తిగత గోపత్యలను దెబ్బతీసి, ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నారని పేర్కొన్నారు. యావత్ శ్రామిక మహిళాలోకం పురుషాధిక్యత, కుటుంబ హింసకు వ్యతిరేకంగా హక్కుల సాధన, స్త్రీ స్వేచ్చ, స్త్రీ పురుష సమానత్వం, సమానవేతనం కోసం పోరాడుతూనే స్త్రీలపై బానిసత్వాన్ని రుద్దే పితృస్వామ్యంపై సంఘటితంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న అప్రజాస్వామిక, ప్రజావ్యతిరే విధానాల మూలంగా పురుషులతో పాటు స్త్రీలు కూడ ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో వెనుకబడి, కనీస జీవన ప్రమాణాలకు దూరం అవుతున్న నేపథ్యంలో మౌనాన్ని వీడాలని కోరారు. మణిపూర్, హర్యాన, గుజరాత్, ఢిల్లీ, ఉత్తర, మద్య ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో మహిళలపై జరుగుతున్న హత్యలు, సామూహిక అత్యాచారాలకు వ్యతిరేకంగా శ్రామిక మహిళలు వర్గపోరాటాలలో బాగస్వామ్యం కావాలని సభాధ్యక్షురాలు పి.సునీత ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ప్రజల ప్రజాస్వామ్య హక్కులతో పాటు బలమైన విప్లవ శ్రామిక మహిళా పోరాట నిర్మాణానికై కృషి చేయవలసిందిగా కోరారు. ఈ పై కార్యక్రమంలో పద్మ, యమున, ఉమా తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.
C.E.O
Cell – 9866017966