*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా లో బ్యూరోమార్చ్17*//:ఖమ్మంలోనెల నెలా… వెన్నెల 92 వ నెల కార్యక్రమం భక్తరామదాసు కళాక్షేత్రం ఖమ్మం నందు జరిగింది ఈ కార్యక్రమంలో జరిగిన సభలో ముఖ్య అతిథిగా రైతు సంఘం రాష్ట్ర నేత నున్న నాగేశ్వరరావు మాట్లాడుతూ సమాజ నిర్మాణానికి సమాజం ముందడుగు వేయడానికి సాంస్కృతిక రంగం యొక్క పాత్ర గొప్పదని స్వాతంత్రోద్యమం కానీ ఆ తర్వాత క్రమంలో జరిగిన అనేక ఉద్యమాలకు సాంస్కృతిక రంగం యొక్క కృషి అద్భుతమని అన్నారు. వాటి పునాదులే నేటి అభ్యుదయ ప్రజాస్వామిక నేపథ్యానికి ఖమ్మం జిల్లా ప్రత్యేకతను ఇనుమడింప చేయడానికి పునాదిగా ఉన్నాయని అన్నారు ఆ సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇటువంటి అభ్యుదయకర కార్యక్రమాలు నిర్వహిస్తున్న నెలనెలా వెన్నెల లాంటి కార్యక్రమాలు గొప్పవని అన్నారు వెన్నెల కురిస్తే వెలుగు వచ్చినట్లు మన మెదడులలో అభ్యుదయ భావజాలాన్ని చైతన్యవంతమైన నాటక రంగాన్ని మనందరికీ అందిస్తున్న ఈ నెల నెలా.. . వెన్నెల పండు వెన్నెలలాగా కురియాలని అభిలాషించారు. ప్రస్తుతం సాంస్కృతిక రంగంలో కూడా కలుషిత సాంస్కృతిక విచ్ఛిన్నకర శక్తులు వచ్చి ప్రజాస్వామ్య అభ్యుదయ విలువలకు నష్టం చే చేయచూస్తున్నాయని ఇలాంటి పరిస్థితుల్లో వెన్నెల లాంటి అభ్యుదయకర సాంస్కృతిక వైభవం పరిఢవిల్లాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథులు కురివెళ్ల ప్రవీణ్ మిత్ర గ్రూప్ చైర్మన్. ఎం ఏ జబ్బార్ ఆవాజ్ రాష్ట్ర నాయకులు. పాల్గొని ప్రసంగించారు సభకు ముందు నెల నెలా… వెన్నెల ప్రధాన బాధ్యులు మోటమర్రి జగన్మోహన్ రావు సహధర్మచారిని మోటమర్రి ఇందిరా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారుకార్యక్రమానికి ముందు నటరాజ నాట్య నికేతన్ గురువు మాధవరావు శిష్యులు నామ ప్రణవిక మరియు యుక్తిక అభినయ రుద్ర నాట్యాలయం గురువు
ఫణి ల్ కణతాల శిష్య బృందం హృతిక ఇషిక తదితరుల శాస్త్రీయ నృత్యాలు ప్రేక్షకులను అలరింపజేశాయి
ఖమ్మంలో భక్తరాదాసు కళక్షేత్రంలో జరుగుతున్న నెల నెలా వెన్నెల నాటిక ఫొటోస్
C.E.O
Cell – 9866017966