జననేత్రం న్యూస్ ప్రతినిధిఖమ్మం,మార్చి17*//:మహాజన నేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు తెలంగాణాలో ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ 1,2,3 అన్ని ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాకతీయ యూనివర్సిటీ పీజీ కళాశాల ఖమ్మం ఎదురుగా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్(ఎంఎస్ఎఫ్) జిల్లా అధ్యక్షుడు ఊటుకూరి రత్నాకర్ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన దీక్షలో సోమవారం పీజీ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ తడికమళ్ళ శేఖర్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఎస్సీ రిజర్వేషన్ లలో మాదిగ లకు గత 50 ఏళ్ళ నుండి అన్యాయం జరుగుతుందని ఈ అంశాన్ని 1965 లోనే బిఎన్ లోకూర్ కమిషన్ నివేదిక లో పేర్కొన్నారని తెలిపారు. తర్వాత రాష్ట్ర స్థాయిలో వేసిన జస్టిస్ రామచంద్రరావు, జాతీయ స్థాయిలో వేసిన ఉషా మెహ్రా కమీషన్లు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించాయి. మంద కృష్ణమాదిగ 30 ఏళ్ళుగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఎత్తిన జెండా దించకుండా వర్గీకరణను సాధించారని గుర్తుచేశారు. నేడు వర్గీకరణ ఫలాలు అందుకునే సమయం వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ చట్టం వచ్చేంతవరకు అన్ని ఉద్యోగ నియామకాలు నిలిపివేసి చట్టం చేసిన తర్వాత ఉద్యోగాలు భర్తీ చేస్తే మాదిగ నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని విజ్ఞప్తి చేశారు. ఈ దీక్షలో డాక్టర్ మోదుగు శ్యామ్ బాబు, డాక్టర్ నూకపొంగు రవిబాబు, డాక్టర్ పేరెల్లి కోటి, డాక్టర్ అద్దంకి తిలక్, పీజీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలల విద్యార్ధిని, విద్యార్దులు పాల్గొన్నారు.
C.E.O
Cell – 9866017966