*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో మార్చ్19*//:బుధవారం ఎదులాపురం మున్సిపాలిటీ,జలగం నగర్ నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని అన్ని కులాల వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు నాలుగు లక్షల రూపాయల వరకు(400000/-) ఆర్థిక సహాయం అందిస్తుందని భూక్యా సురేష్ నాయక్ ప్రజలకు వివరించారు.ఈ పథకం ద్వారా కనీసం 60 నుండి 80 శాతం వరకు సబ్సిడీ అందిస్తుందని తెలిపారు.ఈ పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఈ పథకం ద్వారా 75 రకాల ఉపాధి అంశాలకు సదుపాయం కల్పిస్తుందన్నారు.రాజీవ్ యువ వికాసం పథకాన్ని అమలు చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రభుత్వం పేదల పక్షాన పనిచేస్తుందని తెలియ పరిచారు.ఈ పథకానికి కావాల్సిన పత్రాలు 1)ఆధార్ కార్డు 2)కుల,ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి(అన్ని కులాల వారికి) 3)ఆదాయ పత్రం 2024 నుంచి 2025 వరకు తప్పనిసరి 4)పాన్ కార్డు 5)పాస్ ఫోటో 6) లబ్ధి ధారుడి ఫోన్ నెంబర్
ముఖ్య సూచిక:-) ఒక రేషన్ కార్డు కుటుంబ సభ్యుల లో ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
ది:-17/3/2025 నుండి ధరకాస్తు చేసుకొనుటకు వెసులుబాటు కల్పించిందని అన్నారు.ఈ పథకం ధరకాస్తు చేసుకొనుటకు చివరి తేది 5/4/2025 వరకు ఉందన్నారు.జలగం నగర్ లోని పలు సమస్యలు ప్రజలు భూక్యా సురేష్ నాయక్ దృష్టికి తేగా సానుకూలంగా స్పందించి తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని ప్రజలకు మనోధైర్యం కల్పించారు.ఈ సందర్భంగా వారితో పాటు పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ డైరెక్టర్ నాగార్జునపు.ప్రద్యుమ్న చారి, ఎదులాపురం మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు సంగయ్య, ఖాజా మియా,నాగయ్య, కళ్లెం.శేష్ రెడ్డి,నవీన్ తదితరులు పాల్గొన్నారు
C.E.O
Cell – 9866017966