*స్వాతంత్ర్య సమరయోధుల పోరాట ఫలితంగానే ప్రజాస్వామ్యం లభించింది
*మహిళలకు ముందుగా ఓటు హక్కు కల్పించింది భారతదేశం
*కవిత మెమోరియల్ డిగ్రీ కళాశాలలో వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్
*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో మార్చ్19*//: ప్రజాస్వామ్య స్ఫూర్తి సంరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.
బుధవారం స్థానిక కవిత మెమోరియల్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని, కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ* ప్రజాస్వామ్యానికి ప్రతిరూపమే పార్లమెంట్ వ్యవస్థ అన్నారు. ప్రస్తుతం మన దగ్గర ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థ దాదాపు 150 సంవత్సరాలకు పైగా చేసిన పోరాట ఫలితంగా వచ్చిందని, దాదాపు 5 నుంచి 6 కోట్ల మంది ప్రాణాలను అర్పించి స్వాతంత్ర్యం సాధించారని తెలిపారు.
దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు నిస్వార్ధంగా కృషి చేసిన భగత్ సింగ్, గాంధీ, నెహ్రూ వంటి స్వాతంత్ర్య సమరయోధులను ఎల్లప్పుడూ గుర్తుంచుకొని మనస్సులో పెట్టుకోవాలని కలెక్టర్ తెలిపారు. ప్రపంచంలో మహిళలకు ముందుగా ఓటు హక్కు కల్పించింది భారతదేశమేనని అన్నారు.
జీవన విధానంలో యవ్వనం చాలా ముఖ్యమైనదని, గత జనరేషన్ కంటే ప్రస్తుత యువతకు జ్ఞానాన్ని పెంచుకునేందుకు మంచి అవకాశం లభించిందని అన్నారు. మనకు ఉన్న పరిజ్ఞానాన్ని మంచి మార్గాల్లో వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు. మన దగ్గర ఉన్న చదువు, సంపదను ఉపయోగించి సమాజంలో మరో నలుగురికి సహాయం చేయాలని అన్నారు.
మనం మాట్లాడే అంశాలను తప్పనిసరిగా పాటించాలని, వాస్తవాలను మాట్లాడటం నేర్చుకుంటేనే సమాజంలో మనకు విలువ ఉంటుందని అన్నారు. అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో కూడా నేడు అధికంగా వివక్ష ఉంటుందని అన్నారు. అమెరికాలో నేటికి నల్ల జాతీయులకు హక్కులు లభించడం లేదని, మన భారతదేశంలో మాత్రమే అందరికీ సమాన హక్కులు ఉన్నాయని తెలిపారు.
విభిన్నమైన సంస్కృతులు, భాషలు, ప్రాంతాలు, పరిస్థితులు ఉన్నప్పటికీ భారతదేశ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ నేడు దృఢంగా ప్రపంచం ముందు నిలబడిందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని సంరక్షించడంలో భాగంగా ప్రతి ఒక్కరూ ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ తెలిపారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మంచే జారీచేయనైనది.
ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ఆలోచనలు, దేశం పట్ల వారి నిబద్దత, వివిధ రంగాలలో వారు రూపొందించే పాలసీలను అర్థం చేసుకొని ఓటు వేయాలని కలెక్టర్ తెలిపారు. మహిళలకు భద్రత, మౌళిక వసతులు కల్పన, అభివృద్ధి చర్యలు వంటి అంశాలపై చర్చలు జరగాలని అన్నారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల అఫిడవిట్, క్రిమినల్ కేసులు, ఆస్తుల వివరాలను ఆన్ లైన్ లో పెట్టడం జరుగుతుందని, యువత వీటిని తప్పని సరిగా పరిశీలించి తమ నాయకున్ని ఎంపిక చేయాలని అన్నారు.
దేశంలో మనం కోరుకున్న మార్పు సాధ్యం కావాలంటే మనం ముందడుగు వేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రాణాలు పణంగా పెట్టి ప్రజాస్వామ్యం తెచ్చుకున్నామని, ఇటువంటి దేశాన్ని కాపాడుతూ భవిష్యత్తు తరాలకు అందించాలని అన్నారు. మనం నమ్మిన సిద్ధాంతం ఇతరులతో చర్చించాలని అన్నారు.
వాస్తవాలకు అనుగుణంగా అభిప్రాయాలలో మార్పు తెచ్చుకోవాలని అన్నారు. జీవితంలో మనం ఇతరుల కోసం ఏం చేస్తామనే దానిపై మనకు విలువ ఉంటుందని అన్నారు. ప్రపంచానికే మార్గదర్శకంగా ప్రజాస్వామ్య విలువలు కాపాడడంలో భారతదేశం ముందుంటుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.వి. రమణారావు, శ్రీ కవితా ఎడ్యుకేషనల్ సొసైటీ సెక్రటరీ కోట అప్పి రెడ్డి, జిల్లా ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ ఎన్. శ్రీనివాస్ రావు, ఎస్.ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కొత్తగూడెం ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్. వనజ, ఎన్.వై.కె. కో ఆర్డినేటర్ భాను చందర్, జ్యూరీ మెంబర్ లు ఆర్. సీతారామారావు, కొండపల్లి శ్రీరామ్, పి దినేష్, డాక్టర్ కె. రవి కుమార్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థినీ, విద్యార్థులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
C.E.O
Cell – 9866017966