జననేత్రంన్యూస్ఉమ్మడి.ఖమ్మంజిల్లాబ్యూరోమార్చ్20*//: ఏదులపురం మున్సిపాలిటీ పరిధిలోని ఏదులాపురం జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో గల పిల్లలు ఆటలు ఆడుకునే స్థలంలో విద్యుత్ తీగల గల కరెంటు స్తంభం ప్రమాధకరంగా ఉన్నది. పిల్లలు ఆటలు ఆడుతుండగా కరెంటు ఎర్త్ వస్తుందని అన్నారు. పిల్లలు మూడు సంవత్సరాల నుండి ఎవరు పట్టించుకోక చాల ఇబ్బందికి గురవుతున్నారు. ఈ విషయం ఎదులాపురం జడ్.పి.హెచ్.ఎస్ ప్రధానోపాధ్యాయురాలు శివకుమారి మరియు ఉపాధ్యాయులు కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లా నాయకులు భూక్య సురేష్ నాయక్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంపై విద్యుత్ శాఖ ఏ ఈ నీ భూక్యా.సురేష్ నాయక్ సంప్రదించగా 200 మీటర్లు సర్వీస్ వైరు కావాలి అని కోరగా వెంటనే స్పందించి సర్వీస్ వైర్ ను తెప్పించి మార్పించడం జరిగింది. ఈ సర్వీస్ వైరుకు ఖర్చుల నిమిత్తం రూ 7 వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సురేష్ నాయక్ చిన్నారులను దృష్టి లో పెట్టుకొని పిల్లల ప్రాణాలు ప్రమాదం నుండి కాపాడడానికి తన వంతు సహాయం చేసినారు. ఈ విషయంపై ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు, విద్యార్థిని,విద్యార్థులు,తల్లిదండ్రులు, ఎదులాపురం ప్రజలు భూక్యా సురేష్ నాయక్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
C.E.O
Cell – 9866017966