వెంకటేష్ పి.డి.ఎస్.యూ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి.
*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరోమార్చ్22*//:తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ కేటాయింపుల్లో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేశారని,తక్షణమే బడ్జెట్ కేటయింపులు కి సవరణలు చేసి విద్యారంగానికి 30 % నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత (పి.డి.ఎస్.యూ) ఖమ్మం జిల్లా కమిటీ అధ్వర్యంలో స్థానిక కాకతీయ సబ్ యూనివర్సిటీ నందు తెలంగాణసీఎంరేవంత్ రెడ్డి జిల్లా మంత్రులు బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్ ల దిష్టి బొమ్మ ను దగ్ధం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా
పి.డి.ఎస్.యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి వంగూరి. వెంకటేష్ మాట్లాడుతూ…
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ లోనే విద్యారంగానికి కేవలం (23,108కోట్లు) శాతం 7.57% మాత్రమే నిధులు కేటాయించి విద్యాబిమానులను, విద్యార్థులను నిరాశపరిచిందని అన్నారు. తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా కనీసం 15 శాతం నిధులు కూడా ఇవ్వకపోవడం అన్యామని అన్నారు.
గత బడ్జెట్ లో విద్యారంగానికి: 21,292 కోట్లు(7.3%)
ఈ బడ్జెట్లో గత బడ్జెట్ కంటే 1,816 కోట్లు మాత్రమే అధికం.
విద్యారంగానికి బడ్జెట్లో కేటాయింపులు అంతంత మాత్రమే!
ఇది అత్యంత విచారకరం. రాష్ట్ర విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిన సీఎం రేవంత్ సర్కార్అని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ విశ్వవిద్యాలయాల అభివృద్ధిని కనీసం ఐదు వేల కోట్లు అవసరం ఐతే కేవలం 7.57 శాతం కేటాయించడం ద్వారా భవిష్యత్ లో ప్రభుత్వ విద్యా రంగం పట్ల తమ విద్యా వ్యతిరేక వైఖరి ఉంటుందనే సంకేతాలు ఇచ్చినట్లు ఉన్నదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ
విద్యారంగ బలోపేతం కోసం కృషి చేస్తామని చెప్పిన టిఆర్ఎస్ ఆచరణలో కార్పొరేట్ కు కొమ్ము కాసిందని అదే బాటలో కాంగ్రెస్ నడవాలనుకుంటుందా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ కేటాయింపులు లో విద్యారంగానికి చేసిన ప్రతిపాదనలు సవరించి 30% నిధులు నిధులు కేటాయించాలని దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర్రావు,పొంగులేటి శ్రీనివాస్లు ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ విశ్వవిద్యాలయ ఏర్పాటు పై అసెంబ్లీ వేదికగా ప్రకటన చేయకపోవడం దూర్మార్గం అన్నారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారని ఆ అంశంను పరిగణలోకి తీసుకుని ప్రత్యేక నిధులు బడ్జెట్లో కేటయింపులు చేయాలని అన్నారు.
ప్రభుత్వ వసతి గృహ ,గురుకుల లు విద్యార్థులకు మెస్ చార్జీల పెంపు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం వసతి ఏర్పాటు వంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించాలని కోరారు. గత ప్రభుత్వం లాగా విద్యా వ్యతిరేక కార్యకలాపాలకు కాకుండా తాజా ప్రభుత్వం విద్యా అనుకూల ప్రభుత్వం గా ఉండాలి ఆశాభావం వ్యక్తంచేశారు చేశారు.
తక్షణమే బడ్జెట్ ప్రతిపాదనలకు సవరణ చేసి, ప్రొఫెసర్ కొఠారి కమిషన్ ప్రతిపాదించిన విధంగా రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి సూచించారు.అలాగే ఖమ్మం జిల్లా కేంద్రం గా ప్రభుత్వ జెనరల్ యూనివర్సిటీ పై ముగ్గురు మంత్రులు స్పందిచాలని
లేనియెడల గత ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రభుత్వం కూడా విద్యార్థులు నిరసనలకు గురి కావల్సి ఉంటుందనీ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యూ ఖమ్మం జిల్లా నాయకులు వినయ్, భరత్, సాధిక్, అన్వేష్, శ్రీకాంత్, కార్తీక్, స్పందన, అఖిల, నందిని, శైలజ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
C.E.O
Cell – 9866017966