*అంబేద్కర్ అభయహస్తం 12 లక్షలను కేటాయించాలి
*దళిత వ్యతిరేక బడ్జెట్ పై కెవిపిఎస్ ఆధ్వర్యంలో ప్ల కార్డులతో నిరసన
*కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శినందిపాటిమనోహర్. *జననేత్రంన్యూస్ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరోమార్చ్22*//:2025-26ఆర్థికసంవత్సరంలో 3,04,965 కోట్లరూపాయలతో పెట్టిన రాష్ట్ర బడ్జెట్ లో 40,232 కోట్ల రూ. లతో ఎస్సీ అభివృద్ది ఫండ్ క్రింద కేటాయించారని, అవి కేవలం కాగితాల్లో అంకెలు పెంచుతూ ఖర్చులు తుంచుతున్నారని, ప్రభుత్వం ప్రకటించిన చేవెళ్ల డిక్లరేషన్ అమలుకు కేటాయింపు జరగలేదని, అంబేద్కర్ అభయహస్తానికి ఏటా 750 కోట్ల రూపాయల కేటాయించి ప్రతి దళిత కుటుంబానికి 12లక్షల రూపాయలను ఇస్తామన్న వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయిందని, బడ్జెట్ ను వెంటనే సవరించి దళితుల జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించి వారి ప్రత్యక్ష ప్రయోజనాల కోసం ఖర్చు చేయాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ డిమాండ్ చేశారు.
గురువారం స్థానిక ఎన్నెస్పీ క్యాంప్ లో కెవిపిఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర బడ్జెట్ కేటాయింపుల్లో దళితులపైన చూపిన వివక్షకు వ్యతిరేకంగా ప్ల కార్డులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన నిరసన సభలో మనోహర్ మాట్లాడుతూ అసెంబ్లీలో దళితులకు ప్రతి ఏటా బడ్జెట్లో అంకెలు పెంచుతూ ఖర్చులు మాత్రం తుంచుతున్నారని, 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన బడ్జెట్ లో నూటికి 30% కూడా ఖర్చు చేయలేదన్నారు. ఖర్చు చేయని నిధులను సబ్ ప్లాన్ చట్టం ప్రకారంగా వచ్చే ఏడాది బడ్జెట్లో ఖర్చు చేయాలని సబ్ ప్లాన్ చట్టం నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు. దళితుల యొక్క ఆవాసాలు, విద్యా, వైద్యం, రహదారులు, త్రాగునీరు వంటి మౌలిక ప్రత్యక్ష ప్రయోజనాలపై దృష్టి సారించలేదని చెప్పారు. రాష్ట్రంలో 64 లక్షల జనాభా కలిగిన దళితులకు కనీస ప్రాథమిక అవసరాలు తీర్చే విధంగా బడ్జెట్ ను సవరించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ ఏ బి సి గ్రూపులుగా విడగొట్టిన ప్రభుత్వం, పెరిగిన దళిత జనాభా దామాషా ప్రకారంగా రిజర్వేషన్లు పెంచలేదన్నారు. గత ఏడాది క్రిందట చేవెళ్ల డిక్లరేషన్ ప్రకటించిన ప్రభుత్వం ఏటా 750 కోట్ల రూపాయలు కేటాయిస్తామని 12 లక్షల రూపాయలు అంబేద్కర్ అభయహస్తం అమలు చేస్తామన్న మాటకు ఈ బడ్జెట్ లో నయా పైస కూడా కేటాయించలేదన్నారు. మూడు కార్పొరేషన్లుగా విడగొట్టి దళితుల యొక్క మౌళిక అభివృద్ధికి కృషి చేస్తామన్న మాట నీటి మూటగా మారిందన్నారు. ప్రభుత్వం ఏర్పడి 14 మాసాలు గడిచినప్పటికీ దళిత అభివృద్ధి శాఖకు ఎందుకు మంత్రిని నియమించలేదో చెప్పాలన్నారు. రాష్ట్రంలో దళితుల అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వాలన్నారు. సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీల బకాయిలు పెండింగ్ లో ఉండటం సరికాదన్నారు. హాస్టల్ లో అద్దె భవనాల అద్దెల చెల్లింపులో జాప్యం జరుగుతుందన్నారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం బాధితులకు పరిహారాన్ని సరైన సమయంలో చెల్లించడం లేదన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న దంపతుల ప్రోత్సాహకాలు కూడా ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉంటున్నాయని, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు 2016 నుంచి నేటి వరకు పెండింగ్ లో ఉండటం విచారకరమన్నారు. గత ఏడాది సుమారు పది శాఖలకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసిన దాఖలాలు లేవన్నారు. పేదల భూ పంపిణీ ఊసే లేదన్నారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల ఖర్చుపై నోడల్ ఆఫీసర్ ద్వారా ఆడిట్ చేయించాలన్నారు. సబ్ ప్లాన్ నిధులలో జవాబుదారీ తనాన్ని పెంపొందించాలని, ఎస్సీ ఎస్టీ శాఖల సంక్షేమ అభివృద్ధి పథకాలను సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు చర్చల సందర్భంగా దళితుల, గిరిజనుల సబ్ ప్లాన్ నిధులపై ప్రత్యేక చర్చను ఏర్పాటు చేసి ఒక శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. బడ్జెట్ పై పునరాలోచన చేసి దళిత అభివృద్ధి శాఖకు మంత్రిని నియమించాలన్నారు. చేవెళ్ల డిక్లరేషన్ అమలుకు సరిపడా నిధులు కేటాయించాలని, అంబేద్కర్ అభయహస్తానికి ఏటా 750 కోట్ల రూపాయలు కేటాయిస్తామన్న మాటను నిలబెట్టుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా నాయకులు బోట్ల సాగర్, ఎస్ కె సైదులు, జె. కిరణ్, గుమ్మడి భిక్షం, జె. వెంకన్న బాబు, హిమామ్, నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు.
నంది పాటి మనోహర్
కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఖమ్మం.
C.E.O
Cell – 9866017966