*జననేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో మార్చి28*//:భద్రాచలం పట్నం లో బండారు చందారావు భవనంలో జరిగిన తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు గౌరీ నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి టీఏజీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎంపీ మిడియం బాబురావు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో స్పెషల్ డిఎస్సి నిర్వహించి ఆదివాసి నిరుద్యోగుల సమస్యను పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, అదేవిధంగా అసెంబ్లీ సమావేశాలలో ఆదివాసి ఎమ్మెల్యేలు అందరూ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్లాలని అసెంబ్లీలో చర్చ జరిగే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు, జీవో నెంబర్ త్రీ ని రిఆర్డినేన్స్ చేసే విధంగా మన తెలంగాణ అసెంబ్లీలో ఉన్న ఆదివాసి ఎమ్మెల్యేలందరూ కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసే విధంగా చర్యలు చేపట్టాలని ద్వారా అమలు చేయాలని అన్నారు, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీల జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించలేదని ఆదివాసి ప్రాంతాలలో త్రాగునీరు సాగునీరు విద్య వైద్యం అందే విధంగా నిధులు కేటాయించాలని ఆయన కోరారు, పోడు భూములకు హక్కు పత్రాలు రాని వారందరికీ ఇచ్చే విధంగా ఈ అసెంబ్లీ సమావేశం తీర్మానం చేయాలని లేదంటే రానున్న రోజుల్లో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేపడతామని హెచ్చరిక చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కారం పుల్లయ్య, జిల్లా కోశాధికారి సోయం జోగారావు, జిల్లా కమిటీ సభ్యులు సోడెం ప్రసాద్, పాండ్రు గౌరమ్మ, కొమరం చంటి, కాక హనుమంతరావు, శ్రీను, ఇంకా తదితరులు పాల్గొన్నారు
C.E.O
Cell – 9866017966