*జననేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో మార్చి28*//: సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ*
గత రెండు రోజుల కిందట జరిగిన భద్రాచలం ఘటనలో ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వహించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు అన్నారు.
భద్రాచలం ఏజెన్సీ ఏరియాని ఇక్కడ ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి అక్రమ కట్టడాలు కడుతుంటే చూసి చూడనట్టుగా వ్యవహరించడం వలె అధికారుల నిర్లక్ష్యం వల్లనే ప్రధానంగా ఈ ఘటన జరిగిందని వారు అన్నారు. 30 సంవత్సరాల కిందట కట్టిన పునాది మీద ఆరంతస్తుల బిల్డింగు కడతానికి ప్రయత్నం చేసిన ఈ ట్రస్టు యజమానిపై చర్యలు తీసుకోవాలి. నిబంధనలకు విరుద్ధంగా ఆ బిల్డింగు పర్మిషన్ ఇచ్చిన అధికారులను సస్పెండ్ చేయాలని ప్రజా సేకరణ చేపట్టకుండా ఎలా పర్మిషన్ ఇచ్చారో ఈ ప్రభుత్వాలు,పాలకులు తెలపాలని వారన్నారు. చట్టానికి విరుద్ధంగా వ్యవహరించి ఒకటి నుంచి ఆరు అంతస్తులు కట్టడంలో అంతర్వేమిటి దీనికి సహకరించడంలో పాలకుల సహకారం ఏంటో తెలవాలని వారన్నారు ఇవే కాదు భద్రాచలంలో అనేకమంది నిబంధనలకు విరుద్ధంగా అంతస్తుల మీద అంతస్తులు కడుతూ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని చూసి చూడనట్టుగా పాలకులు అధికారులు వ్యవహరిస్తున్నారని వారన్నారు. ఈ ఘటన పై న్యాయ విచారణ జరిపించి బాధితులని ఆదుకోవాలని సరైన సహకారం అందించాలని ఆ కుటుంబాలకు జీవనోపాధి కల్పించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్,పిఓడబ్ల్యు జిల్లా నాయకురాలు కప్పల సూర్యకాంతం పి వై ఎల్ జిల్లా నాయకులు బర్ల రామకృష్ణ,భవన నిర్మాణం జిల్లా అధ్యక్షులు యర్నం శ్రీనివాస్, జిల్లా నాయకులు కొమరం మల్లేష్,నాయకులు వినేష్ మహిళా సంఘ నాయకురాలు శిరీష,రమ్య తదితరులు పాల్గొన్నారు
C.E.O
Cell – 9866017966