*గౌడ, గీత కార్మికుల కుటుంబాలపై, పీడిత వర్గాల పై గ్రామాభివృద్ధి కమిటీల దౌర్జన్యం ఆగడాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలి
*నల్ల చంద్ర స్వామి మాదిగ,
ఎమ్మార్పియస్.రాష్ట్రనాయకులు,యం యస్ పీ జిల్లా అధ్యక్షులు
*జననేత్రంన్యూస్.యాదాద్రి భువనగిరిజిల్లా ప్రతినిధిఏప్రిల్08*//:నిజామాబాద్ జిల్లా అర్ముర్ డివిజన్ పరిధి లోని ఎర్రగట్ల మండలం తాళ్లపల్లి గ్రామంలో శ్రీరామనవమి రోజున గౌడ కుటుంబ మహిళలు గుడికి వెళ్తే వారిని రానివ్వక వీడిసి సభ్యులు,గుడి పూజారితో సహా అవమానించారు. దీనిని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మార్పియస్ రాష్ట్ర నాయకులు ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ అన్నారు. గౌడ, గీత కార్మికుల కుటుంబాలపై గ్రామాభివృద్ధి కమిటీల దౌర్జన్యం ఆగడాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌడ, గీత కార్మికులు తమ గీత వృత్తిపై ఆధారపడి వేలాది కుటుంబాలు జీవిస్తున్నారు. తాటి చెట్టు ఎక్కి కిందికి దిగేంత వరకు క్షణక్షణం జీవన్మరణ సమస్యలతో ఇబ్బందులు ఒక పక్క ఉండగా.. ఎలాంటి చట్టబద్ధతలేని వీడీసీ లు పీడిత వర్గాలకు చెందిన వృత్తిదారులు, సామాన్య ప్రజల పైన కుల బహిష్కరణలు, గ్రామ బహిష్కరణలు నిత్య కృత్యమవుతున్నాయి. అని ఇందులో భాగమే ఎర్రగట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామ గౌడ గీత కార్మికుల బతుకులు ఆందోళనకరంగా మారినాయి. ఊర్లో కల్లు అమ్మాలన్నా, కూల్డ్రింకులు, ఇతర నిత్యవసర సరుకులు అమ్ముకోవాలన్నా, ఏ పని చేయాలన్నా వీడిసి లకు మాముళ్లు ఇవ్వాల్సిందే అని లేకుంటే కుల బహిష్కరణ, గ్రామ బహిష్కరణలు చేసి జరుమానా విధిస్తూ రాక్షసానందం పొందుతున్నారు అని అన్నారు. వీడిసీ ల పేరిట సమాంతర ప్రభుత్వాలను నడుపుతు సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని. ఈమధ్య ఎర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామ గౌడ కుటుంబాలను బహిష్కరించగా, శనివారం శ్రీరామ నవమి కి వెళ్లిన గౌడ మహిళల కులస్తులను వీడీసీ సభ్యులు, పూజారి అడ్డుకోవడం అంటే దేవుని పైన కూడా వీడిసి ఆగడాలు కొనసాగుతున్నాయి అని అనడానికి నిదర్శనం అని అన్నారు. ఇలాంటి అనేక సంఘటనలు వెలుగులోకి రానివి ఎన్నో జరుతున్నాయి అని వాటన్నిటిని ప్రభుత్వం ఉన్నత అధికారులతో ప్రత్యేక విచారణ జరిపి వెలికితీసి గ్రామ అభివృద్ధి కమిటీల ఆగడాలపై చర్య తీసుకొని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని అన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని లేనిచో గీత, గౌడ కార్మికులను, పీడిత వర్గాలను ఏకం చేసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అన్నారు. ఈ ఖండన ప్రకటన జారీ చేసిన వారిలో
ఎమ్మార్పియస్ రాష్ట్ర నాయకులు యం యస్ పీ జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ, మండల ఇంచార్జీ మందుల లింగ స్వామి మాదిగ, మండల కన్వీనర్ పందుల భిక్షపతి మాదిగ,సీనియర్ నాయకులు గట్టు రాములు మాదిగ, భూషి చంద్రయ్య మాదిగ, గురుకు యాదగిరి మాదిగ,మందుల విజయ్ మాదిగ,గట్టు జ్ఞానేశ్వర్ మాదిగ, మాదిగ విద్యార్థి సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి నల్ల బాలరాజు మాదిగ తదితరులు ఉన్నారు.
C.E.O
Cell – 9866017966