*మహనీయుల మాసంలో కులవివక్షపై ప్రతిఘటిద్దాం*
*కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ పిలుపు*
*కెవిపిఎస్ ఆధ్వర్యంలో ఘనంగా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకల *జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరోఏప్రిల్11*//:మనువాదంపై పోరాటాలు చేయడమే నేడు జ్యోతిరావు పూలేకు అర్పించే నిజమైన నివాళి అని, మహనీయుల మాసమైన ఏప్రిల్ నెలలో కుల వివక్షపై ప్రత్యక్ష ప్రతిఘటన పోరాటాలు నిర్వహించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక నగరంలోని ఎన్ఎస్పి క్యాంపు నందుగల సంఘం జిల్లా కార్యాలయంలో ఫూలే చిత్ర పటానికి మరియు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ముందుగల మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ముత్తమాల ప్రసాద్, నందిపాటి మనోహర్ లు పూలమాలలు వేసి పూలేకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా నాయకులు బోట్ల సాగర్ అధ్యక్షతన జరిగిన పూలే జయంతి సభలో వారు పాల్గొని మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని కుల జాడ్యం మన దేశంలోనే ఉన్నదని, వేల సంవత్సరాలు గా కులం పేరుతో ఆధిపత్యం చేస్తూ సామాజిక, ఆర్థిక దోపిడీ కొనసాగిన దానికి వ్యతిరేకంగా తమ జీవితాంతం పోరాడిన గొప్ప సామాజిక విప్లవకారులని పూలే దంపతులను కొనియాడారు. నేడు దేశంలో పాలిస్తున్న ఆర్ఎస్ఎస్, బీజేపీ పాలకులు పచ్చి మతోన్మాద అవకాశవాద రాజకీయాలను నడుపుతూ దేశంలో వైషామ్యాలను రెచ్చగొడుతూ మరల పాతకాలపు నీచమైన రాచరిక వ్యవస్థలోకి తీసుకెళ్ళే దుష్ట ప్రయత్నాలు చేయడం దుర్మార్గమన్నారు. పూలే స్పూర్తితో సామాజిక, కుల అణచివేతలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా నాయకులు నకరికంటి చిరంజీవి, జె.వెంకన్న బాబు, నర్రా రమేష్, పాపిట్ల సత్యనారాయణ, కొమ్ము శ్రీను, కర్లకుంట నరేష్, చెరుకుపల్లి వీరభద్రం, పగిడిపల్లి వెంకట్రావు, గుర్రం ఉపేందర్, ఆంతోటి రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
*నందిపాటి మనోహర్, KVPS జిల్లా ప్రధాన కార్యదర్శి, ఖమ్మం.*
C.E.O
Cell – 9866017966