*జననేత్రం న్యూస్ ప్రతినిధి ఏప్రిల్12*//:చేగుంట మండలం వడియారం గ్రామంలో గత రెండు రోజులుగా సఫాయి కార్మికులు విధుల్లోకి వెళ్లకుండా గాంధీ చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులు బిక్షాటన చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నాలుగు నెలలుగా తమకు వేతనాలు రాక కుటుంబం గడవలేకపోతుందని, ప్రభుత్వం వెంటనే జీతాలు చెల్లించాలని కోరారు, జీతాలు రాకపోవడంతో వీధుల్లోకి రాకపోతే సంబంధిత పంచాయతీ కార్యదర్శి తమపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని జీతం లేకుండా ఎలా పనిచేస్తామని వారు ఆవేద వ్యక్తం చేశారు. వెంకట్ గౌడ్ మాట్లాడుతూ గత మూడు రోజులుగా గ్రామంలో సఫాయి కార్మికులు విధుల్లోకి రాకపోవడంతో చెత్తాచెదారం గ్రామంలో పేరుకుపోయిందని ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి వేతనాలు చెల్లించే విధంగా చూడాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు బండారి పెద్దరాములు, బండారి కృష్ణ, దాసంచంద్రం, వెల్దుర్తి ఎల్లం, రవి, స్వామి, తదితరులు పాల్గొన్నారు.
C.E.O
Cell – 9866017966