*జననేత్రం న్యూస్ ప్రతినిధి ఏప్రిల్14*//: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గ మీ సాక్షి న్యూస్ ఇన్చార్జ్ చింతలచెరువు భాగ్యరాజు మరియు దమ్మపేట మండలం మందలపల్లి గ్రామ ప్రకాష్ నగర్ కాలనీ దళిత ముద్దుబిడ్డ సీనియర్ నాయకుడు కాకాని బాబురావు ఇరువురు కలసి ఈరోజు మన భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మందలపల్లి సెంటర్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద పూల మాల వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఆనాడు ఎస్సి ఎస్టి సబ్ ప్లాన్ నేటి ప్రజా ప్రభుత్వంలో ఎస్సీ కుల వర్గీకరణ చట్టాలలో కీలక పాత్ర పోషిస్తూ అణగారిన వర్గాల బడుగు బలహీన ప్రజల పక్షాన నిలిచిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అంతేకాదు ఆయన 1891, ఏప్రిల్ 14న జన్మించిన అంబేద్కర్. రాజ్యంగ నిర్మాత, భారతదేశ తొలి న్యాయ శాఖ మంత్రి,ఆర్థికవేత్త,ప్రొఫెసర్, లాయర్ ఇలా ఎన్నో సేవలు అందించారు. ప్రతీ సంవత్సరం ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతిని దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుపుకుంటారు.ఈ సందర్బంగా అంబేద్కర్ చెప్పిన అమూల్యమైన సూక్తులు(1) మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలి. అందుకు దేవుడి మీద కానీ, మహానుభావుల మీద కానీ, ఆధారపడవద్దు. డా.బీఆర్ అంబేద్కర్(2) కులం పునాదుల మీద, ఒక జాతిని నిర్మించలేరు.ఒక నీతిని నిర్మించలేరు. డా.బీఆర్ అంబేద్కర్(3) నీకోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు. జనం కోసం జీవిస్తే జనం హృదయాల్లో నిలిచిపోతావు. డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్(4) ఎంత గొప్పగా జీవించామన్నదే జీవితం ఎంత కాలం జీవించామన్నది కాదు..డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్(5) వినయం, శీలం లేని విద్యావంతుడు మృగం కంటే ప్రమాదకరం- డా.బి.ఆర్. అంబేద్కర్(6) చరిత్రను మర్చిపోయేవాళ్లు చరిత్ర సృష్టించలేరు -డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్.అంటూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చెప్పిన సూక్తులు మరొక్కసారి గుర్తు చేసుకున్నారు భాగ్యరాజు బాబురావు..
C.E.O
Cell – 9866017966