*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ఏప్రిల్14*//: భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న సామాజిక సంస్కర్త బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దళితుల అభ్యున్నతకే నిరంతరం శ్రమించిన సమాజంలో పేరుకుపోయిన అసమానతలు తొలగి పోవాలంటే విద్య ద్వారానే సాధ్య పడుతుందని భావించి, వారికీ రిజర్వేషన్స్ విద్యా ఉద్యోగ అన్ని రంగాలలో కూడా కల్పిస్తానే సమాజంలో అసమానతలు లేకుండా జీవిస్తారు అని తలంచి దాని కొరకు తన ఆరోగ్యాన్ని తన కుటుంబాన్ని త్యాగం చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతిని ఈరోజున TGO భవనం నందు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా TGO రాష్ట్ర అధ్యక్షులు మరియు తెలంగాణ ఉద్యోగుల రాష్ట్ర సెక్రటరీ జనరల్ గౌరవనీయులు శ్రీ ఏలూరి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆనాడు సమాజంలో దళితులు బడుగు బలహీన వర్గాలు అభ్యున్నతికి సమాజంలో వారికి సమాన అవకాశాలు కల్పించాలంటే తప్పనిసరిగా రిజర్వేషన్స్ కావాలని, వాటి ద్వారానే వారు అభ్యున్నతి సాధిస్తారని ,అటు దేశ స్వతంత్రం కోసం ఉద్యమంలో పాల్గొంటూ తన జాతి కోసం నిరంతరం పోరాడిన నాయకుడు మన అంబేద్కర్ వారి ఆశయాలను తప్పనిసరిగా టీజీవో సంఘం మరియు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అసమానతలు లేని సమాజం కోసం ,ప్రతి వారి హక్కుల కోసం పోరాడుతామని తెలియజేసినారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కస్తాల సత్యనారాయణ కార్యదర్శి మోదుగు వేలాద్రి టీఎన్జీవో జిల్లా కార్యదర్శి కొనె దన శ్రీనివాసరావు (బుల్లెట్) జిల్లా జాయింట్ సెక్రెటరీ తాళ్లూరి శ్రీకాంత్ ,TGO ట్రెజరర్ కొండపల్లి శేషు ప్రసాద్ TGO హౌస్ బిల్డింగ్ సొసైటీ కార్యదర్శి డాక్టర్ పి విజయ్ కుమార్ టిజిఓ మహిళ కార్యదర్శి సుధారాణి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మన్యం //రమేష్ బాబు జిల్లా కార్యవర్గ సభ్యులు డాక్టర్ హరీష్ D. బాలాజీ MD . తాజుద్దీన్ తమ్మిశెట్టి శ్రీనివాస్ డాక్టర్ నాగేశ్వరరావు మోదుగు వెంకట్ తెలంగాణ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ టీచర్స్ అసోసియేషన్ జిల్లా నాయకులు సూరంపల్లి రాంబాబు డాక్టర్ డి బంగారి తెలంగాణ ప్రిన్సిపాల్ అసోసియేషన్ జిల్లా బాధ్యులు సింహాచలం GJLA జిల్లా అధ్యక్షురాలు ప్రమీలరాణి కార్యదర్శి నాగేశ్వరరావు జయప్రకాష్ రామయ్య నాగేందర్, తెలంగాణ గెజిటెడ్ గ్రంథా పాలకుల జిల్లా అధ్యక్షులు నక్క ప్రసాద్ బాబు కార్యదర్శి ఫణికుమార్ మోహన్ కవిత,TIGLA జిల్లా నాయకులు శంకర్ భరత్ సతీష్ రెడ్డి రమణ చైతన్య TGLA – 475 జిల్లా అధ్యక్షులు కొండ వినోద్ బాబు కార్యదర్శి గుమ్మడి మల్లయ్య TGEJAC డిస్టిక్ జాయింట్ సెక్రెటరీ అంతోటి తిరుపతిరావు మురళి కృష్ణ శ్రీకాంత్ TGLA -711 అసోసియేషన్ జిల్లా బాధ్యులు యాకయ్య కాశయ్య కిరీటి రాంబాబు తదితరులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది ..
ఈ సందర్భంగా గుమ్మడి మల్లయ్య అంబేద్కర్ జీవితచరిత్ర నీ తెలియజేసే పాట పాడి అందరినీ అబ్బురపరిచాడు.
C.E.O
Cell – 9866017966