*జననేత్రం న్యూస్ నిర్మల్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్14*//:
సారంగాపూర్ మండల కేంద్రంలో ఆదివాసి గూడలో గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ పూలాజి బాబా ధ్యాన మందిరాన్ని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. మానవ జీవితానికి ధ్యానం ఎంతో ఉపయోగపడుతుందని, ధ్యానం వల్ల రోజువారి జీవితంలో ఏర్పడే ఒత్తిడి, ఇతరత్రా ఇబ్బందులు దూరమవుతాయని, మానసికంగా, శారీరక ఎదుగుదలకు ద్యానం – ద్యానమందిరం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.
నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా అని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇచ్చిన అనేక హామీలు అమలయ్యే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిర్మల్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. మారుమూల గిరిజన గూడాలు, తండాలకు రవాణా సౌకర్యాలు, పంట పొలాలకు నీరు అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అన్ని విధాల తమకు అండగా ఉన్న ప్రజల అభ్యున్నతికి పాటుపడుతానని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కాల్వ నరేష్, నాయకులు ఎంపీటీసీ నారాయణ, వీరయ్య, విలాస్, శేఖర్ గౌడ్, చెన్న రాజేశ్వర్, కోరిపెల్లి రాజేశ్వర్ రెడ్డి, సాహెబ్ రావ్, తిరుమల చారి, ఎల్లన్న, జాదవ్ వినోద్, భూమా రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రాజా రెడ్డి, సాధు రాంరెడ్డి, గంగారెడ్డి, గుమ్మల రవి, కేవ్లా నాయక్, పాల్గొన్నారు.
C.E.O
Cell – 9866017966