*జననేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో ఏప్రిల్15//:దుమ్ముగూడెం మండలం బుర్ర వేముల గంగోలు మధ్య ఉన్న ప్రధాన రహదారి దగ్గర సిపిఎం పార్టీ దుమ్ముగూడెం మండల కమిటీ ఆధ్వర్యంలో భద్రాచలం నుండి చర్ల వెంకటాపురం మండలాల వరకు ఉన్న ప్రధాన రహదారుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని భద్రాచలం నియోజవర్గ స్థానిక ఎమ్మెల్యేను సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు, అదేవిధంగా దుమ్ముగూడెం మండలంలో తూరుబాక గ్రామం లో ఉన్న ప్రధాన రహదారి దగ్గర ఉన్న వంతెన కూలిపోతున్న స్థానిక ఎమ్మెల్యే అదే విధంగా ప్రభుత్వ అధికారులు పట్టించుకోరా నెలలు గ డుస్తున్న ప్రతి రెండు మూడు రోజులకు ఒక్కరు రోడ్డు యాక్సిడెంట్లో మరణిస్తున్న చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు భవిష్యత్తులో రహదారుల సమస్య పరిష్కరించకపోతే సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేపడతామని హెచ్చరిక చేస్తున్నాం అన్నారు, మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాలలో ఈ రహధారులకు ఎన్ని నిధులు కేటాయించారు కూడా స్థానిక ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు, ఇసుక ర్యాంపులకు విచ్చలవిడిగా పర్మిషన్లు ఇవ్వడం రోడ్లు పాడైపోయినప్పుడు పట్టించుకోపోవడం ప్రజలు చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం అసలు ఉన్నట్టా లేనట్టా అంటే ఎందుకు పట్టించుకోవట్లేదు అని నెలకు 5 నుండి 6 మంది రహధార్లు గుంతలు ఉండడం వల్లనే ప్రమాదం జరిగి చనిపోతున్నారని గుర్తు చేశారు, మంత్రులు కూడా జోక్యం చేసుకోవాలని గతంలో మంత్రి తుమ్మల నాగేశ్వరావు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రకు పోయిన ప్రాంతం మాకు ఇస్తే మేము బాగు చేస్తామని అన్నారు మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న మన రోడ్ల సమస్య పరిష్కారం కావడం లేదు వెంటనే పరిష్కారం చేసే విధంగా చర్యలు చేపట్టాలని సూచన చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలగాని బ్రహ్మచారి మండల కార్యదర్శి కారం పుల్లయ్య జిల్లా కమిటీ సభ్యులు యలమంచి వంశీకృష్ణ ,మర్మం చంద్రయ్య, కొర్స చిలకమ్మ,మండల కార్యదర్శి వర్గ సభ్యులు యలమంచి శ్రీను బాబు, బొల్లి సత్యనారాయణ,కాక కృష్ణ ,సోడె రాంబాబు,పూనెం శోభారాణి, గుడ్ల రామ్మోహన్ రెడ్డి, వర్సా చిన్నారావు, తెల్లం ధర్మయ్య, కల్లూరి దేవి, కొమరం చంటి, పాయం హరిబాబు, కనకారావు, పెనుబల్లి ప్రసాద్,ఉబ్బా చిన్నారావు, అహ్మద్ హుస్సేన్,కొర్స నాగరాజు ఇంకా తదితరులు పాల్గొన్నారు
C.E.O
Cell – 9866017966