*జననేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో ఏప్రిల్23*//:ఆదివాసీహక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ ఇరప. రాజు చర్ల మండలంలోని ఇటివల మంజూరైన సొసైటీ ఇసుక ర్యాంప్ ల్లో ఆదివాసీ ప్రజలకు ఉపాధి కల్పించాలని ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ ఇరప.రాజు డిమాండ్ చేశారు.ఇందులో బాగంగా మంగళవారం చేశారు.5వ షెడ్యూల్లో పీసా చట్టం ఉల్లంఘన అవుతుందని ఇందుకు బాధ్యులు అధికారులు పాలకులు అని విమర్శించారు.సొసైటిల పేరిట మంజూరైన ఇసుక ర్యాంపుల్లో అధికార పార్టీ నాయకులకు ఏం పని అని నిలదీశారు.దీనికి భద్రాచలం ఐటిడిఏ పీఓ, భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు? పీసా చట్టాలను అతిక్రమించి ర్యాంపులు తెచ్చుకుందే కాకుండా వాటిని సిక్రెట్గా మొదలు పెట్టడం ఏంటని ప్రశ్నించారు? ఈ విషయమై భద్రాచలం ఎమ్మెల్యే స్పందించాలన్నారు?లేని యెడల స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మేల్యేకు బుద్ది చెప్పాడానికి ఆదివాసీ సమాజం సిద్దంగా ఉందన్నారు? ఆదివాసీ ఎమ్మెల్యే అయ్యి ఉండి ఆదివాసీల పొట్టకొట్టే వారి పక్షాన మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు? నిజంగా ఎమ్మెల్యేకు ఆదివాసీ ప్రజల ఉపాధికి అభివృద్ధి మీద ధ్యాస ఉంటే నిన్న అనగా తేది 21-04-2025న భద్రాచలం కేంద్రంగా ఇసుక రైజింగ్ కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారని జరుగుతున్న ప్రచారానికి సమాధానం చెప్పాలన్నారు? ఆదివాసీ చట్టాల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతుంటే ఆదివాసీ ఎమ్మెల్యే అయ్యి ఉండి ఏం చేస్తున్నారని మండి పడ్డారు? ఇప్పటికైనా సొసైటీ ఇసుక ర్యాంప్ గుట్టు విప్పి, ఆదివాసీ ప్రజలకు ఉపాధి కల్పించకపోతే తేది 23న చర్ల వచ్చే ఎమ్మెల్యే,జిల్లా అధికారులను అడ్డుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు
C.E.O
Cell – 9866017966