*జననేత్రం న్యూస్ ప్రతినిధి ఏప్రిల్24*//:నంద్యాల జనసేనా నాయకులు రాచమడుగు చందు, సుందర్ ల ఆథ్వర్యంలో మొదటి రోజు సాయంత్రం గాంథీ చౌక్ కూడలి నందు కోవొత్తులతో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.
రెండవ రోజు భాగంగా నంద్యాల మున్సిపల్ కార్యాలయం ప్రక్కన నంద్యాల కఠిక నేలపై కూర్చోని మౌన దీక్ష చేపట్టి జరిగిన ఘటనకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
రేపు మూడవ రోజున పట్టణంలోని స్థానిక శ్రీనివాస్ సెంటర్ లో మానవ హారంగా ఏర్పడి బాథిత కుటుంబాలకు సంఘీభావంగా వారి కుటుంబాలకు భగవంతుడు మనో ధైర్యం కల్పించాలని తెలియజేయనున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన నాయకులు మారాచు గురు బాబు ,సీనియర్ నాయకులు,జనసేన రాము, దండు మురళి మరియు జనసైనికులు ,శివ శేఖర్,సంజీవ్ రాయుడు, నాగరాజు,వీర మహిళలు జ్యోతి,రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
C.E.O
Cell – 9866017966