*జననేత్రంన్యూస్భద్రాద్రికొత్తగూడెంజిల్లా.ప్రతినిధిఏప్రిల్25*///:వివరాల్లోకి వెళితే స్థానికంగా అధికార బలం చూసుకుంటూ కొందరు ప్రజాప్రతినిధులు అధికారులు కుమ్మక్కై అర్హత కలిగిన పేదవానికి ఇందిరమ్మ ఇల్లు అందకుండా చేస్తున్నారని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మళ్లీ కుటుంబ సమగ్ర సర్వే నిర్వహించి అర్హత కలిగిన నిజమైన ప్రతి ఒక్క పేదవానికి ఇందిరమ్మ ఇల్లు అందాలని స్థానికులు ఎంపీడీవోకి మరియు స్థానిక డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు
ఎంతో కాలం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మేము పనిచేస్తున్నప్పటికీ మాకు ఇల్లు రాకపోయినా పర్వాలేదు పేదవానికి ఇల్లు వస్తుందని ఆశపడ్డాము కానీ అధికారులు తప్పుడు సర్వే వల్ల వచ్చిన కొన్ని ఇల్లనే తప్పు దోవ పట్టిస్తున్నారు ఇది రాజకీయ బలమా ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమా అర్థం కావట్లేదని స్థానికులు దీనస్థితిలో ఉండిపోయారు
కచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్క పేదవానికి ఇందిరమ్మ ఇల్లు అందాలని అలా కాకుండా అధికార బలంతో అధికారుల నిర్లక్ష్యంతో తప్పు దోవ పట్టిస్తే సహించేది లేదని తెలిపారు తరువాత లిస్టులో చూసుకుందాం అని చెప్పటం చాలా బాధాకరంగా ఉందంటూ వాపోయారు కచ్చితంగా మళ్ళీ సర్వే చేసి నిజమైన అర్హత కలిగిన పేదవానికి ఇందిరమ్మ ఇల్లు అందాలని అందని పక్షంలో కార్యాలయాల ఎదుట భారీ ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు
C.E.O
Cell – 9866017966