*జననేత్రంన్యూస్.చేగుంటప్రతినిధిఏప్రిల్25*//:జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు చేగుంట మండల మైనార్టీ నాయకులు అన్నారు. శుక్రవారం పట్టణ కేంద్రంలోని జామ మసీదు వద్ద కమిటీ అధ్యక్షులు (సదర్ )ఆధ్వర్యంలో ఉగ్ర దాడిని నిరసిస్తూ నిర్వహించిన ర్యాలీ కార్యక్రమంలో పట్టణ మైనారిటీ నాయకులు,ప్రజలు పాల్గొన్నారు, ఈ సందర్బంగా ముస్లిం నాయకులు మాట్లాడుతూ భారతదేశంలో ఐక్యతను దెబ్బతీసేందుకు కొందరు ఉగ్రవాదులు ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని, అటువంటి వారిని ప్రభుత్వం పట్టుకొని కఠినంగా శిక్షించాలని అన్నారు. దాడులు జరగకుండా కేంద్ర ప్రభుత్వం మరింత కఠినమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు షకీల్, రహీముద్దీన్, అలీ, అన్వర్, జలీల్, అజీం, నయీమ్, హుసేని, ఇలియాస్, జమీల్, ఖలీల్ ఆరిఫ్,తదితరులు పాల్గొన్నారు.
C.E.O
Cell – 9866017966