*జననేత్రం న్యూస్ మెదక్ ప్రతినిదిఏప్రిల్26*//:మెదక్ :ఏప్రిల్ 26: మెదక్ పట్టణంలో కుల బహిష్కరణ గురించి శనివారం నాడు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డికి బాధితులు ఫిర్యాదు చేశారు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ పట్టణానికి చెందిన వనం శ్రవణ్ కుమార్, కండెల కవిత గత రెండు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారని, ఆ క్రమంలో వాళ్ళిద్దరు ఇంటి నుండి వెళ్లిపోగా కవిత, శ్రవణ్ కుమార్ తల్లిదండ్రులు మెదక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వారిని తీసుకువచ్చి పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రుల పూచికత్తుపై ఇంటికి పంపించడం జరిగింది అన్నారు. ఆ తర్వాత ఈనెల15వ తారీఖు నాడు ఎవరికి చెప్పకుండా శ్రవణ్ కవిత మరోసారి ఇంటి నుంచి వెళ్ళిపోతూ ఇంట్లో లెటర్ పెట్టి వెళ్లినట్లుగా ఫిర్యాదు లో తెలిపారు. అనంతరం కండెల కవిత కుటుంబీకులు శ్రవణ్ కుమార్ తల్లిదండ్రుల కుటుంబం పై దుర్భాషలాడుతూ కాలనీలోని కుల బహిష్కరణకు పిలుపునివ్వడంతో వారి ఇంటికి కాలనీవాసులు కానీ కులస్తులు గాని రాకపోవడం పట్ల మనస్థాపానికి గురై జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డికి ఫిర్యాదు చేశామని తెలిపారు. మెదక్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన వారి తీరు మారకపోవడం పట్ల బాధితులు జిల్లా ఎస్పీ సహకారం అందించాలని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు ఈ సమస్యపై పోలీస్ ఉన్నత అధికారులు స్పందించి సమస్య పరిష్కారమయ్యే విధంగా కృషి చేయాలని ఆశిస్తున్నట్లు బాధితులు గోడు వెలిబుచ్చారు. ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో లేకపోవడంతో సూపర్డెంట్ కు ఫిర్యాదు చేయడం జరిగింది.
C.E.O
Cell – 9866017966