భారత విద్యార్థి ఫెడరేషన్-(ఎస్ఎఫ్ఐ *ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా గర్ల్స్ కన్వీనర్ రత్నవేణి మాట్లాడుతూ…*
*జననేత్రంన్యూస్.ప్రతినిధి.మే06*//:అందాలపోటీలునిర్వహించడంవల్లఅమ్మాయిలపైచెడుప్రభావంఎక్కువపడుతుంది .అమ్మాయిలకిరక్షణలేకుండాపోతుంది.రాష్ట్ర వ్యాప్తంగా ఆడపిల్లలకు రక్షణ లేకపోవడం,మహిళా రక్షణ చట్టాలు పూర్తిస్థాయిలో అమలుచేయకపోవడం,ప్రేమపేరుతోమోసపోయిహత్యాచారానికి గురికావడం లాంటివి జరుగుతున్నాయి.అదేవిధంగా సినిమాల పేరుతో యాడ్స్ రూపకంగా అమ్మాయిలని అతి గోరంగా, నీచంగా చూపిస్తు ప్రొమోషన్స్ చేయడం కూడా రాష్ట్రంలో పెరిగింది.తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వాటి పైన చర్య తీసుకోకుండా మిస్ వరల్డ్ ప్రోగ్రాం ను తెలంగాణ రాష్ట్రంలోని మన హైదరాబాద్ లో నిర్వహించడం, దీనిని స్వయంగా ప్రభుత్వమే ఎంకరేజ్ చేయడం సిగ్గుచేటు…
దీనివల్ల అమ్మాయిలపై తప్పుడు ధోరణి ప్రభావం పడుతుంది.అమ్మాయిలను చదువుల పరంగా ముందుకు సాగాలని చెప్పే ప్రభుత్వమే మిస్ వరల్డ్ పేరుతో అమ్మాయిలని కించపరిచే విధంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు.
రాష్ట్రంలో అమ్మాయిల పైన అత్యాచారాలు అగైత్యాలు జరగడానికి ఇటువంటివి ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు…రాష్ట్రంలో అమ్మాయిలని ఏ విధంగా ముందుకు తీసుకరావాలో,ఏ విధంగా మహిళా సాధికారత పెరుగుతుంది అనే అంశాల పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తే బాగుంటుంది.అమ్మాయిలకు సరైన సదుపాయాలు లేక కాలేజీలో,హాస్టల్స్ లో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్య వ్యవస్థపై దృష్టి పెట్టాలని భారత విద్యార్థి ఫెడరేషన్-(ఎస్ఎఫ్ఐ), మంచిర్యాల జిల్లా కమిటీగా మేము కోరుతుతున్నాము.
ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్య వ్యవస్థ అరకొర సదుపాయలతో సాగుతుంది అందులో ముఖ్యంగా గురుకుల భవనాల అద్దె కట్టి,విద్యార్థులకు సరైన భోజనం పెట్టాలని, మిస్ వరల్డ్ ప్రోగ్రాం కి పెట్టే 200కోట్ల రూపాయలు విద్యావ్యవస్థకి కేటాయించి పెండింగ్ స్కాలర్షిప్స్ మరియు ఫీజు రియంబర్స్మెంట్స్ తక్షణమే విడుదల చేసి, డిగ్రీ పరీక్షలు నిర్వహించాలని,రాష్ట్రనికి విద్యశాఖ మంత్రిని నియమించాలని రాష్ట్ర విద్యార్థుల ఒక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారికీ న్యాయం చేయాలనీ భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ)మంచిర్యాల జిల్లా కమిటీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వన్ని హెచ్చరిస్తుంది.
C.E.O
Cell – 9866017966