*బాలుని సర్జరీలో పాల్గొన్న ప్రముఖ న్యూరో సర్జన్ డా.వరుణ్ జొన్నలగడ్డ, డా. రాకేష్ బృందం
*అంకుర హాస్పిటల్‌కు జీవితాంతం రుణపడి ఉంటామన్న బాలుని తల్లిదండ్రులు
జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో మే07//:పీడియాట్రిక్ వైద్య సేవల్లో అగ్రగామిగా కీర్తి గడించిన ఖమ్మం అంకుర హాస్పిటల్స్‌లో 30 రోజుల వయసున్న బాలునికి హై రిస్క్ బ్రెయిన్ సర్జరీవిజయవంతంగా పూర్తి చేసి ప్రాణం పోశారు. అసలే నెలల తక్కువగా పుట్టడం, మరో పక్క బ్రెయిన్‌లో నరాలు చిట్లిపోయి తీవ్రంగా రక్త స్రావం జరగడంతో సదరు బాలుడు పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఈ నేపథ్యంలో పలు ప్రయివేటు హాస్పిటల్స్‌కు తిప్పినా బాలునికి సరైన వైద్యం అందక పోవడంతో చివరికి అంకుర హాస్పిటల్స్‌లో ఉన్న అత్యాధునిక సాంకేతిక సర్జరీ పరికరాలతో బాలునికి బ్రెయిన్ సర్జరీని సక్సెస్ ఫుల్‌గా పూర్తిచేసిన డా.వరుణ్ జొన్నలగడ్డ, డా.శ్వేత, డా.అపర్ణ, డా.రాకేష్, డా.జాకీర్, వారి వైద్య బృందం ఈ మేరకు విజయవంతంగా పూర్తిచేసినట్టు బుధవారం ఖమ్మంలో మీడియాకు తెలిపారు. ఇందుకు సంబంధించి అంకుర హాస్పిటల్స్ వైద్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గానికి చెందిన దంపతులకు బాలుడు నెలల తక్కువగా పుట్టడంతో పాటు బ్రెయిన్‌లో నరాలు చిట్లిపోయిన మెదడు అంతా రక్త స్రావమై బాలుడు ఉలుకుపలుకూ లేకుండా అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో బాలుని తల్లిదండ్రులు ఆందోళన చెంది ఖమ్మంలోని వివిధ హాస్పిటళ్లలో చూపించినా బ్రెయిన్‌లో రక్త స్రావం జరిగిందనీ, విజయవాడ లేదా హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. దీంతో అంతదూరం వెళ్లలేని ఆ దంపతులు విజయవాడలోని ఒక ప్రముఖ పిల్లల వైద్యశాలకు తరలించారు. విజయవాడలోని వైద్య బృందం కూడా తమ వద్ద ఇంత పెద్ద రిస్క్ ఆపరేషన్ చేయలేమని చేతులెత్తేయడంతో హైదరాబాద్‌కు వెళ్లే స్తోమత లేక చివరికి ఖమ్మంలోని అంకుర హాస్పిటల్‌ను సంప్రదించారు. ప్రముఖ న్యూరో సర్జన్ డా.వరుణ్ జొన్నలగడ్డ ద్వారా బాలుని అంకుర హాస్పిటల్‌లో బ్రెయిన్ సర్జరీ చేసేందుకు ముందుకు రావడంతో బాలుని తల్లిదండ్రుల కోరిక మేరకు ఆపరేషన్‌కు సిద్ధం చేశారు. అనంతరం న్యూరో సర్జన్ డా.వరుణ్ జొన్నలగడ్డ నేతృత్వంలోని ఎనస్థీషియా వైద్యులు డా.ఎం. కోటేశ్వరరావు, డా.జ్యోత్స్న, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ డా.అపర్ణ, డా.శ్వేత, ఓటీ స్టాఫ్, పలువురు వైద్య బృందం దాదాపు మూదున్నర గంటల పాటు శ్రమించి బాలుని బ్రెయిన్‌లో రక్త స్రావం జరిగిన సున్నితమైన ప్రదేశంలో విజయవంతంగా సర్జరీ పూర్తిచేశారు. అనంతరం బాలుని ఐసీయూకు తరలించి రెండు రోజుల పాటు వెంటలేటర్ సాయంతో వైద్యం అందించారు. అనంతరం బాలుని ఆరోగ్యం వేగంగా కోలుకోవడంతో వెంటిలేటర్ తొలగించి సాధారణ వార్డుకు తరలించారు. అనంతరం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉండటంతో పాటు పూర్తిగా కోలుకోవడంతో బుధవారం డిశ్చార్జీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలుని తల్లిదండ్రులు మాట్లాడుతూ..తమ బాబుకు ప్రాణదానం చేసిన అంకుర హాస్పిటల్స్‌ను జీవితాంతం గుర్తుంచుకుంటామని తెలిపారు. అరుదైన వైద్య సేవలకు కేరాఫ్‌గా ఉన్న అంకుర హాస్పిటల్స్ అన్నింటా వైద్య సేవల్లో ముందు వరుసలో ఉందన్నారు.వైద్య బృందం మాట్లాడుతూ.. అంకుర హాస్పిటల్స్‌లో ఉన్న అత్యాధునిక ఎక్విప్‌మెంట్ సాయంతో నిపుణులైన వైద్యబృందం తమ నూపుణ్యాన్ని ప్రదర్శించి అత్యంత సీరియస్ కేసును సైతం విజయవంతంగా పూర్తిచేసినట్టు వారు తెలిపారు. మీడియా సమావేశంలో అంకుర హాస్పిటల్స్ ఖమ్మం ఎండీ డా.రాకేష్, సిబ్బంది పాల్గొన్నారు.
C.E.O
Cell – 9866017966