*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో మే09*//:రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రామంలో బడిబాట నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగాప్రధానోపాధ్యాయులు ఆమంచి సత్యనారయణ మాట్లాడుతూ.. గ్రామంలో వివిధ సెంటర్ లలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి వారికి ఈ విద్యా సంవత్సరం లో ఆరెంపుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి విద్యార్థుల రిజల్ట్స్ 100% సాధించినట్లు వివరించి పాఠశాల యొక్క విధి విధానాలను తెలియజేస్తూ, పాఠశాల వయసుగల పిల్లలను చేర్పించవలసిందిగా కోరారు.అలాగే పాఠశాలలో లభిస్తున్న వివిధ సౌకర్యాలు ఉచిత రెండు జతల ఏకరూప దుస్తులు మరియు పాఠ్యపుస్తకాలు,నోటు పుస్తకములు, రుచికరమైన, పౌష్టిక ఆహారముతో కూడిన మధ్యాహ్న భోజనం, ఐ ఎఫ్ పి ప్యానల్స్ తో డిజిటల్ బోధన, కంప్యూటర్స్ మరియు గ్రంథాలయం, విశాలమైన ఆట స్థలము,చక్కటిఆహ్లాదకరమైనవాతావరణములో విద్యను అభ్యసించడానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచి ఉపాధ్యాయ బృందంఅందరూ క్వాలిఫైడ్ టీచర్స్ మరియు 20సంవత్సరాలపైగాఅనుభవం కలిగిన ఉపాధ్యాయులచే బోధనజరుగుతుందనితెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఏఏ పిసి చైర్మన్ పప్పుల విజయ, ఉపాధ్యాయులు జి.కమలమ్మ,ఎం.సతీష్ ,సి హెచ్.అశోక్, ఆర్.పార్వతి గ్రామస్తులు పాల్గొన్నారు.
C.E.O
Cell – 9866017966