*జననేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో మే 11*//:భద్రాచలానికి చెందిన ఈసం జ్యోతిర్మయికి ఉస్మానియా యూనివ ర్సిటీ నుంచి డాక్టరేట్ లభించింది. భౌతిక శాస్త్రంలో ఆమె సమర్పించిన పరిశోధనాత్మక గ్రంథానికి గురువారం డాక్టరేట్ ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కుమార్తె అనురాధ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పీహె చీ (ఆర్ట్స్) పూర్తి చేసిన మొదటి ఆదివాసీ మహిళ కాగా, భౌతిక శాస్త్రంలో డాక్టరేట్ సాధించిన ఆదివాసీగా జ్యోతిర్మయి రికార్డు సృ ష్టించారు. ఆమె తండ్రి అనంతయ్య భద్రాచలం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబు ల్గా విధులు నిర్వర్తిస్తుండగా, పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
C.E.O
Cell – 9866017966