జననేత్రం న్యూస్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం ప్రతినిది జూన్07*//:నందిగామ పట్టణం లోని అశోక్ నగర్ లో గల ఈద్గాలో బక్రీద్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు
బక్రీద్ (ఈద్-ఉల్-అధా) సందర్భంగా నందిగామ పట్టణంలోని ముస్లిం సోదరులందరూ ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు*
ఈద్గాలో నమాజ్ ఆచరించినటువంటి కొంతమంది ముస్లిం సోదరులు కాలాతీతం అయినందువల్ల మసీదుల్లో వారి కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మసీదులో కూడా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు మత గురువులు
బక్రీద్ సందర్భంగా, ముస్లిం సోదరులు మసీదుల్లో సామూహిక ప్రార్థనలు చేసి నమాజ్ చేశారు. ఈ పండుగ త్యాగం మరియువిశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. బక్రీద్ నమాజ్ తర్వాత, వారు ఒకరికొకరు శుభాకాంక్షలు* తెలియజేసుకున్నారు మరియు పేదలకు దానం చేశారు.
బక్రీద్ (ఈద్-ఉల్-అధా) అనేది ఇస్లాం మతంలో ఒక ముఖ్యమైన పండుగ, ఇది త్యాగం మరియు విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. ఈ పండుగను ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఘనంగా జరుపుకుంటారు*
బక్రీద్ నమాజ్ తర్వాత, ముస్లిం సోదరులు ఒకరికొకరు శుభాకాంక్షలుతెలియజేసుకుంటారు మరియు పేదలకు దానం చేస్తారు. ఈ పండుగలో త్యాగo మరియు దానానికి ప్రాముఖ్యత ఉంది. మరియు ముస్లింలు తమ సామాజిక బాధ్యతలను గుర్తుంచుకుంటారు
ఇస్లామిక్ పవిత్ర గ్రంథాల్లో విశేష ప్రాధాన్యత
బక్రీద్ పండుగకు ఇస్లామిక్ పవిత్ర గ్రంథాల్లో విశేష ప్రాధాన్యత ఉంది. హజరత్ ఇబ్రాహీం అల్లాహ్‌కు తన కుమారుడిని త్యాగం చేయడానికి సిద్ధపడ్డ త్యాగానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. అల్లాహ్ ఆ త్యాగాన్ని గుర్తించి, కుమారుడి స్థానంలో గొర్రెను పంపాడన్న నమ్మకం ఉంది. ఆ విధంగా ముస్లింలు బక్రీద్ రోజున జంతువులను బలి ఇస్తారు. ఆ మాంసాన్ని కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు, పేదలతో పంచుకుంటారు. ఇది త్యాగం, సేవ, సమానత్వానికి ప్రతీకగా భావిస్తారు.
C.E.O
Cell – 9866017966