*జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో జూన్10*//: మేము అనగా నాయి బ్రాహ్మణ ( మంగలి ) కులస్థులం. తరతరులుగా మా కులవృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నాం .మేము దేవాలయం లో దేవుడి మేల్కొలుపు సన్నాయి మేళముతో , పెళ్లి శుభకార్యాల్లో మైలపోలు ,పుట్టువెంట్రుకలు ,కర్మలు, కేశఖండన మరియు ప్రతి ఒక్కరికి శుద్ధి శుభ్రదత తో హెయిర్ కటింగ్ ,షేవింగ్స్ తో అందంగా తయారు చేస్తున్నాము .ఈ జీవన ప్రయాణం లో ఎన్ని కష్టాలు,అవమానాలు వచ్చిన అదే వృత్తిని నమ్ముకొని ,కొన్ని వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాం .పిల్లల చదువులు ,కుటుంబ పోషణ కష్టమౌతున్న ఈ తరుణం లో ప్రభుత్వాలు కులవృత్తులు కాపాడుతాం అంటూనే మరో వైపు ఇతర కులస్తులకు మా మంగళ కులవృత్తి ఐనా సెలూన్ షాప్స్ పెట్టుకొనుటకు ట్రేడ్ లైసెన్స్ ఇవ్వడం వలన పెద్ద షాపులు ఏర్పాటు చేస్తున్నారు .తక్షణమే కార్పొరేట్ షాప్స్ తొలగించి మాకు సహకరించాలని కోరుకుంటున్నాం .దీని వలన మా నాయి బ్రాహ్మణులు భారీ పెట్టుబడులు పెట్టుకోలేక ,చాలా దుర్భరమైన జీవితంకొనసాగిస్తున్నారు. షాపులకిరాయిలుకట్టుకోలేక ,కుటుంబ పోషణ చేయలేక మాకు చావే శరణ్యం అనే స్థితి లో ఉన్నాము,ప్రభుత్వాలు మరియుఅధికారులు ,చదువుకున్నవిద్యావంతులు ,మేధావులు సకల జనులకు మా మంగళ కులవృత్తి తో మీకు సేవ చేస్తూ జీవిస్తున్నాం.మాపై దయవుంచి మా కులవృత్తిని మాకే చెందే విదంగా పేటెంట్ హక్కు కల్పించే విదంగా సహకరించి నగరం లోని వేల కుటుంబాలని కుటుంబాలని కాపాడాలనికోరుకుంటున్నాము…
మా విన్నపాలు …మా నాయి బ్రాహ్మణలు వృత్తి హక్కులు మాకే కల్పించాలి దీనిపై జీఓ జారీ చేయాలి. కార్పొరేట్ సెలూన్ షాప్స్ తొలిగించాలి.
మమ్మల్ని షెడ్యూలు కులాల జాబితాలో చేర్చాలి …
మా నాయి బ్రాహ్మణ ఆత్మ గౌరవ భవనం కొరకు స్థలం కేటాయించాలని నాయి బ్రాహ్మణ నగర అధ్యక్షులు
యలమందల జగదీష్ కోరారు ఈ కార్యక్రమం లో నగర కమిటీ, సభ సభ్యులు తదితరులు పాల్గొన్నారు…
C.E.O
Cell – 9866017966