*జననేత్రంన్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో జూన్ 16*//:భద్రాచలంలో ఉమ్మడి పాయం. రాష్ట్ర అధ్యక్షులు. గురుకులాల మిగులు సీట్లకు స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్న సందర్భంగా గోండ్వానా సంక్షేమ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో నలుమూలల నుండి విద్యార్థులు భారీ ఎత్తున తరలివచ్చి చదువుకోడానికి సీటు వస్తుందో రాదో అనే ఆందోళనలో ఉన్న విద్యార్థులందరికీ అన్ని గ్రూపులలో సీట్లు కేటాయించి గిరిజన విద్యాభివృద్ధికి ఐటిడిఏ అధికారులు కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించారు.
మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తే . మెరిట్ రానీ విద్యార్థులు సీటు రాలేదని బెంగతో డిస్క్రిప్షన్కు లోన్ అవుతారని. అలా జరగకుండా షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి గురుకులాలు ఆశ్రమం పాఠశాలలో 100% సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
మెరిట్ రాని విద్యార్థులకు గురుకులాలలో సీటురాకపోతే కార్పొరేటు కళాశాలలో చదువుకునే స్తోమత లేక పదవ తరగతి వరకు చదివి మధ్యలోనే చదువును ఆపేసే ప్రమాదం ఉన్నదని కావున ఐటీడీఏ అధికారులు విద్యను ప్రోత్సహించి విద్యార్థులందరికీ ఆయా గ్రూపులో సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాటేబోయిన శ్రీను. వెంకటేశ్వర్లు. సోడి దుర్గ భవాని. వర్షా మేఘన. తాటి శృతి కీర్తన. వగ్గేల త్రివేణి. పాల్గొన్నారు.
C.E.O
Cell – 9866017966