*జననేత్రం న్యూస్ దౌల్తాబాద్ మండలం ప్రతినిధి జూన్20*//: దౌల్తాబాద్ మండలం షేర్ పల్లి బందారం గ్రామానికి చెందిన రంగంపేట సత్తయ్య ఆరేపల్లి సమీపంలో బైక్ పై వెళ్తుండగా యాక్సిడెంట్ అయి అక్కడే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సత్తయ్య కొడుకు గత కొంతకాలంగా హైదరాబాదులో కంపెనీలో పని చేస్తున్నాడు. అక్కడే తన నాన్నకు పని చేసుకోమని చెప్పడంతో వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. అక్కడ ఉన్న ప్రజలు వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేశారు. ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కు తరలించడం జరిగింది. ఘటన స్థలానికి సంబంధించిన వివరాలను పోలీసులు అక్కడ ఉన్న ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
C.E.O
Cell – 9866017966