బంగారం, వెండి, విదేశీ కరెన్సీ విరాళాలు. *జననేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో జూన్ 28//:భద్రాచలంశ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో 50 రోజుల హుండీ లెక్కింపు గురువారంఆలయప్రాంగణంలోని చిత్రకూట మండపంలో జరిగింది. ఈ హుండీ లెక్కింపులో మొత్తం రూ.1,97,79,049 నగదు ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
అంతేకాకుండా, 65 గ్రాముల బంగారం, 1.50 కేజీల వెండి, వివిధ దేశాల కరెన్సీ నోట్లు, నాణేలు హుండీల్లో లభించినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. భక్తుల విశ్వాసానికి నిదర్శనంగా భారీ విరాళాలు సమకూరాయని ఆమె పేర్కొన్నారు.
లెక్కింపులో ఆలయ సిబ్బందితో పాటు బ్యాంకు అధికారులు, భద్రతా సిబ్బంది పాల్గొన్నారు.
C.E.O
Cell – 9866017966