*–BRS పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు–*
*జననేత్రం న్యూస్ ములుగు జిల్లా జూన్28*//:
త్వరలో జరగబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజావ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీనీ ఓడించి బిఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని *కాకులమర్రి లక్ష్మణ్ బాబు* పిలుపునిచ్చారు….
*ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..*
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు,కార్మికులు,విద్యార్థులు,మహిళలు అన్ని వర్గాల ప్రజలు సంక్షేమ పథకాలు అందక ఇబ్బంది పడుతున్నారని BRS పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు మండిపడ్డారు.కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం అనివార్యం అని అన్నారు.అందుకే బిఆర్ఎస్ శ్రేణులు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి అని పిలుపునిచ్చారు.ఇప్పటికే కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు,6గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమై ప్రజలలో చులకన అయ్యిందని ఎన్నికల అంతరం గ్యారంటీగా రైతు భరోసా ఎత్తివేస్తారని జోస్యం చెప్పారు.ప్రజలలో కెసిఆర్ పట్ల,బిఆర్ఎస్ పార్టీ పట్ల ఆదరణ పెరిగిందని ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఎన్నికలలో పోరాడాలని అన్నారు.ఎన్నికలలో నాయకులు,కార్యకర్తలు ఏవిధంగా వ్యవహరించి ప్రజలకు చేరువ కావాల్సిన వ్యూహాలను BRS పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు వివరించారు.ప్రభుత్వ మెడలు వంచి హామీలు అమలు చేయాలంటే బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కాకులమర్రి లక్ష్మణ్ బాబు పిలుపునిచ్చారు…
C.E.O
Cell – 9866017966