*కొరవడిన అధికారుల పర్యవేక్షణ*
*వసతిగృహాలు వైపు కన్నెత్తి చూడని సంబంధిత అధికారులు
*సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి
*ఏఐఎస్ఎఫ్*
జననేత్రం న్యూస్ ఉమ్మడి ఖమ్మంజిల్లాబ్యూరో.జూన్28*//:ప్రభుత్వాలువసతవిద్యార్థులసంక్షేమంమరిచాయని,సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు గోడు ప్రభుత్వానికి పట్టదా అని ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి కార్యదర్శి ఇటికాల రామకృష్ణ అన్నారు.స్థానిక ఖమ్మం గిరి ప్రసాద్ భవన్ లో ఏఐఎస్ఎఫ్ ముఖ్య కార్యకర్తలు సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ,బీసీ సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలన్నారువిద్యా సంవత్సరం ప్రారంభమై నేపథ్యంలో సంక్షేమ హాస్టల్స్ లో విద్యార్థులకు కనీస, మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. విద్యార్థులు చదువుకోడానికి కనీస సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ అధికారులు కానీ చీమకుట్టినట్టుగా కూడా లేదని, వసతి గృహ విద్యార్థుల పట్ల అధికారులు పత్తి పట్టినట్టు వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటని అయన అన్నారు. వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు నాలుగు జతలు ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్, బెడ్ సీట్లు ప్లేట్లు, గ్లాసులు, ట్రంకు పెట్టెలు ఇప్పటివరకు అందించలేదని అన్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మెస్ చార్జీలు, క్లాస్మోట్ చార్జీలు పెంచాలన్నారు.
శిథిల వ్యవస్థకు చేరుకున్న భవనాలు స్థానంలో కొత్త భవనాలు నిర్మించాలని అన్నారు. హాస్టల్ వార్డెన్స్ స్థానికంగా లేకపోవడం వలన విద్యార్థి సమస్యలు పట్టించుకునే నాధుడే లేడుని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ డీడీలు తమ విధులను సక్రమంగా నిర్వహించాలని అన్నారు. డిడిలు తమ ఆఫీస్ కార్యాలయాలు విడనాడి సంక్షేమ హాస్టల్స్ బాట పట్టి హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. వసతి గృహాల విద్యార్థి సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవడం
శోచీనియమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వసతి గృహా విద్యార్థుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, తీసుకోకపోతే విద్యార్థుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని అయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శులు శివ వంశి జిల్లా నాయకులు గోపి రాహుల్ ప్రభాస్ నవీన్ నరేష్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు..
C.E.O
Cell – 9866017966