*తక్షణమే కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలి.
*జననేత్రం న్యూస్ భద్రాచలం నియోజకవర్గం ప్రతినిధి జులై01/:భద్రాచలం పట్టణం లొ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పూనెం ప్రదీప్ కుమార్ డిమాండ్.
గత ఇరవై సంవత్సరాలుగా కొబ్బరికాయల వ్యాపారం నిర్వహించుకుంటున్న వారిపై దౌర్జన్యం చేసి ఆ షాపులను కూల్చి వేస్తున్న భద్రాచలం పట్టణానికి చెందిన కురిచేటి రామచంద్రమూర్తి అతని కుటుంబ సభ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల పరిరక్షణ సంస్థ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పూనెం ప్రదీప్ కుమార్ డిమాండ్ చేశారు. భద్రాచలం పట్టణాన్ని గోదావరి వరదల నుంచి రక్షించేందుకు ప్రభుత్వం కరకట్ట నిర్మించిందని, కరకట్ట నిర్మాణం సమయంలో ప్రభుత్వం భూమిని సేకరించి మిగిలిన భూమిని ఇరిగేషన్ శాఖకు అప్పజెప్పడం జరిగిందన్నారు. అప్పటినుండి ఆ స్థలంలో కొంతమంది నిరుపేద వ్యక్తులు కొబ్బరికాయల వ్యాపారం నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నారని, ఆ షాపుల వెనకాల కొంత స్థలం కలిగిన కురిచేటి రామచంద్రమూర్తి తను నిర్మించే భవనానికి ఈ షాపులు అడ్డు ఉన్నాయని కారణంతో పేద ప్రజలు నిర్వహించుకుంటున్న కొబ్బరి షాపులను అత్యంత దుర్మార్గంగా వర్షం వచ్చే సమయంలో కూల్చివేయడం, ఇష్టం వచ్చినట్లు మాట్లాడి మీ చేతనైంది చేసుకోండని మూర్ఖంగా ప్రవర్తించడం హేయమైన చర్యని ఆయన అన్నారు. అసలు తనది కాని స్థలంపై తన దౌర్జన్యం ఏమిటని, ఇరిగేషన్ శాఖకు సంబంధించిన కొంత స్థలంలో వ్యాపారాలు నిర్వహించుకుంటూ ఉంటే ఇతనికి వచ్చిన నష్టమేమని ఆయన ప్రశ్నించారు. ఇరిగేషన్ శాఖ షాపులను తీసివేయమంటే ఒక అర్థం ఉందని, కానీ ఇతను దౌర్జన్యం చేయడం షాపును కూల్చివేయడం మూర్ఖం అన్నారు. వయసులో పెద్దవారు అనే ఆలోచన విచక్షణ లేకుండా షాపులను కూల్చడం సరికాదని, జోరు వర్షంలో తడుచుకుంటూ వృద్దులు విలపించడం బాధాకరమన్నారు. ఇన్ని సంవత్సరాలు షాపులు నిర్వహించుకుంటున్న వారికి ఒకవేళ అక్కడ షాపులు తీసివేస్తే ప్రత్యామ్నాయ మార్గం చూపించాలని ఆయన కోరారు. కొబ్బరికాయల షాపులను ధ్వంసం చేసిన వ్యక్తులపై పూర్తిస్థాయిలో విచారించి కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
C.E.O
Cell – 9866017966